కింగ్ ఖాన్ షారూక్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ- జీరో. 2018 డిసెంబర్‌లో రిలీజవుతోంది. క్రిస్మస్ కానుకగా అభిమానుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఫక్తు కాపీ సినిమా. విశ్వనటుడు కమల్ హాసన్ కెరీర్ ఆరంభంలో నటించిన విచిత్ర సోదరులు కాన్సెప్టుతో తెరకెక్కుతోందని, ఇప్పటికే సౌత్ లో బాగా ఫేమస్ అయిన ఈ క్లాసిక్ సినిమాలో కమల్ హాసన్ పాత్రకు కాపీ కొట్టి - జీరో చిత్రంలో షారూక్ పాత్రను తీర్చిదిద్దుతున్నారని ఆరంభమే విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే ఇదే ప్రశ్న దర్శకుడు ఆనంద్ .ఎల్.రాయ్ కి ఎదురైంది. ఆ క్రమంలోనే ఆనంద్ ఓ ఆసక్తికర సమాధానం చెప్పారు. ఈ సినిమాకి విశ్వనటుడు కమల్ హాసన్ కి చూపిస్తాను. సౌత్ సినిమాకి కాపీ అంటూ సాగిన ప్రచారం నేను కూడా పరిశీలించాను. నేను కూడా విన్నాను ఆ మాటలు. నేను దీనిని ఛాలెంజింగ్ గా తీసుకున్నా. షారూక్ కి కూడా ఈ విషయాన్ని చెప్పాను. కమల్ హాసన్ అప్పు రాజా (హిందీ) (అపూర్వ సహోదరులు) సినిమాలో ఈ తరహా పాత్ర ఉందని చెప్పాను. షారూక్ కి ఆ సంగతి తెలుసు. పైగా కమల్ హాసన్ - షారూక్ ఇద్దరూ స్నేహితులు. కలిసి హే రామ్ లాంటి చిత్రంలో నటించారు. ఆ ఇద్దరూ మాట్లాడుకున్నారు.. అని తెలిపారు. ఇకపోతే ఇదివరకూ ఈద్ కానుకగా రిలీజ్ చేసిన జీరో టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. దానికి జావెద్ జాఫ్రీ వాయిస్ వోవర్ బాగా కుదిరింది. టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగిందని ఆనంద్.ఎల్. రాయ్ తెలిపారు.
కమల్ `చిత్ర సోదరులు` తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మాతృక `అపూర్వ సహోదరగళ్`(1989) తమిళ చిత్రం. తెలుగులో `అపూర్వ సహోదరులు` గానూ - హిందీలో `అప్పూరాజా` గానూ అనువదించి రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ మరుగుజ్జుగా - మేయర్ గా ద్విపాత్రాభినయం చేశాడు. అన్ని భాషల్లో పెద్ద హిట్టయ్యింది. ప్రస్తుతం ఆనంద్ ఎల్.రాయ్ తెరకెక్కిస్తున్న జీరో చిత్రంలో షారూక్ మరుగుజ్జు పాత్రకు అంతే స్పందన వస్తోంది.