టాప్‌ 100లో.. ముగ్గురు మొనగాళ్ళు

Update: 2017-06-15 04:40 GMT
ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఈ ఏడాది ప్రపంచ ధనికులు లిస్ట్ ని విడుదల చేసింది. ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా మన బాలీవుడ్ స్టార్లు హవా చాటిచెప్పారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ - మోస్ట్ పాపులర్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ - బాక్స్ ఆఫీసు కింగ్ అక్షయ్ కుమార్ టాప్ 100 లిస్ట్ లో ఉన్నారు. ఈ సారి బిగ్ బి తన వేగాన్ని తగ్గించి 100 లిస్ట్ లోకి రాలేకపోయారు. ఈ ఏడాది షారుక్ 38 మిలియన్ సంపాదనతో 65 స్థానం - సల్మాన్ ఖాన్ 37 మిలియన్ సంపాదనతో 71 వ స్థానం, అక్షయ్ కుమార్ 35.5 మిలియన్ సంపాదన తో 80 వ స్థానం లో చోటు దక్కించుకున్నారు. మునిపటి కన్నా ఇప్పుడు షారుక్ ఖాన్ - అక్షయ్ కుమార్ వాళ్ళ ర్యాంక్ లను మెరుగుపరుచుకున్నారు  

సల్మాన్ - షారుక్ - అక్షయ్ వీళ్ళ ముగ్గురు ఈ లిస్ట్ లోకి రావడం పెద్ద కష్టమైన పని ఏమి కాదు వాళ్ళకి.  ఈ మొనగాళ్ళు చేసిన సినిమా బిజినెస్ - బ్రాండ్ బిజినెస్ ఈ ఏడాది చాలా ఘనంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే షారుక్ ‘రయెస్’ సినిమా ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు విడుదలై మొదటి వారంలో 150 కోట్లు కలెక్షన్లు చేసి హృతిక్ రోశన్ కాబిల్ ను వెనకకు నెట్టింది. దీనితో పాటు షారుక్ ఖాన్ ప్రచారం చేస్తున్న బ్రాండ్ అంతకు అంతా పెరుతున్నాయి. ఇప్పుడు షారుక్ ఖాన్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ప్రచారం చేస్తున్నాడు. ప్రపంచంలో బాలీవుడ్ కి పోస్టర్ బోయ్ గా నిలిచాడు. ఇంకా మన బాలీవుడ్ అల్ టైమ్ ఫిట్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ జాలీ ఎల్‌ ఎల్‌ బి 2 సినిమా 117 కోట్లు కలెక్ట్ చేసింది. నామ్ షబానా కూడా పెట్టిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తం బిజినెస్ చేసి నష్టం రాకుండా నడిచింది. ఇంకా సల్మాన్ ఖాన్ సుల్తాన్ 2016 వచ్చి బాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద అత్యదిక కలెక్షన్లు చేసిన రెండో సినిమాగా రికార్డు నెలకొల్పింది.   

షారుక్ - అక్షయ్ గత ఏడాది చేసిన సినిమాలు వలన ప్రచారం చేస్తున్న బ్రాండ్స్  వలన వాళ్ళ ర్యాంక్లు బాగా పైకి వచ్చాయి అని చెప్పవచ్చు. షారుక్ కిందటి ఏడాది లిస్ట్ లో 86 వ స్థానం లో ఉంటే ఈ సారి 65 వ స్థానం కు చేరాడు అలాగే అక్షయ్ కిందటి సారి 94 వ స్థానం లో ఉంటే ఈ సారి 80 స్థానం కు చేరుకున్నాడు. మొత్తానికి మన దేశ అభిమానులలో క్రేజ్ తో పాటు ఫోర్బ్స్ లిస్ట్ లో టాప్ లో నిలిచి బాలీవుడ్ మార్కెట్ స్థాయిని మరింతగా  ప్రపంచానికి పరిచయం చేశారుని చెప్పవచ్చు .

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News