హిట్ అయితేనే పెద్ద అచీవ్ మెంట్ అనుకుని విడుదల చేసిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ ఏకంగా ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలవడం ఎవరూ ఊహించనిది. బాలీవుడ్ క్రిటిక్స్ కొందరు ఒక మాఫియాగా మారి దీని మీద ఎంత విష ప్రచారం చేసినా అవేవి కలెక్షన్లకు అడ్డుగా నిలవలేకపోయాయి. 280 కోట్లకు పైగా వసూళ్లతో ఈ ఏడాదిలోనే టాప్ హిట్ గా నిలిచిన కబీర్ సింగ్ ఇప్పటికీ చాలా కేంద్రాల్లో ఒకటి రెండు షోలతో రన్ అవుతూనే ఉంది.
నెల రోజులు దాటినా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ లో ఎక్కడా కనిపించని షాహిద్ కపూర్ ఎట్టకేలకు బయటికి వచ్చాడు.రాగానే తనదైన శైలిలో విమర్శకులకు బలమైన కౌంటర్ల బాణాలు విసిరాడు. ముఖ్యంగా కబీర్ సింగ్ పాత్ర ప్రేమతో ప్రీతిని చాచి పెట్టి కొట్టడం మీద వచ్చిన కామెంట్స్ కు పవర్ ఫుల్ పంచ్ ఇచ్చాడు. సంజు సినిమాలో హీరో పాత్ర నేను మూడు వందల మంది స్త్రీలతో పడుకున్నా అని చెప్పినప్పుడు బాత్ రూమ్ లోని కమోడ్ ని తీసుకుని సోనమ్ కపూర్ మెడలో మంగళసూత్రం అని వేసినప్పుడు ఏమన్నారని గుర్తుచేశాడు.
అదంతా ఫిలిం మేకింగ్ లో భాగమని ప్రేమని ఎక్స్ ప్రెస్ చేసే ఫీలింగ్ అని నమ్మిన మీరు కబీర్ ప్రీతీని చెంప దెబ్బ కొట్టడాన్ని మాత్రం క్రైమ్ గా ఎలా ప్రొజెక్ట్ చేస్తారని విరుచుకుపడ్డాడు. కబీర్ సింగ్ కొట్టాక మీరంతా ఇంత ఫీలవుతున్నారు అంటే ఖచ్చితంగా నేను బాగా చేశానని అర్థమైందని ముక్తాయింపు ఇచ్చాడు. మొత్తానికి ఐదు వారాల తర్వాత అదిరిపోయే కౌంటర్లతో షాహిద్ కపూర్ ఇచ్చిన సమాధానాలకు కౌంటర్ వస్తే ఒట్టు