సెలబ్రిటీలకు ఉండే తిప్పలు అన్ని ఇన్ని కావు. వారికి ఉన్న పేరుప్రఖ్యాతులు చూసినప్పుడు.. ఇలాంటి నేమ్ అండ్ ఫేం ఉంటే బాగుండనిపిస్తుంది. కానీ.. ఒక్కసారి ఆ చట్రంలోకి వెళ్లిపోతే తిరిగి రావటం ఏ మాత్రం సాధ్యం కాదు. పేరు ప్రఖ్యాతులు వచ్చిన నాటి నుంచి ప్రైవసీ అన్నది లేకుండా పోయే పరిస్థితి. ఈ కారణంగానే సెలబ్రిటీలు స్వేచ్ఛగా తిరగాలని అనుకుంటారుకానీ.. ఆ పని అస్సలు చేయలేక.. తమ ముక్కు ముఖం తెలీని చోట్లకు వెళ్లి గడిపేస్తుంటారు. ఈ తిప్పలన్నీ తెలిసే కాబోలు.. బాలీవుడ్ హీరో ఒకరు.. తన కుమార్తె ఫోటో అస్సలు తీయటానికి ఒప్పుకోవటం లేదు.
తన ముద్దుల కూతురు ఫోటో కొన్నాళ్లు బయటకు రాకూడదని భావిస్తున్నట్లుగా ఆయన తీరు కనిపిస్తోంది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.. మీరా రాజ్ పుత్ లకు ఇటీవలే పండంటి పాపాయి పుట్టింది. ఆ బుజ్జాయికి మిషా కపూర్ అని పేరు కూడా పెట్టేశారు. అయితే.. మిగిలిన వారిలా కాకుండా.. తన కుమార్తె ఫోటోను బయట ప్రపంచానికి షేర్ చేయటానికి షాహిద్ కపూర్ అస్సలు ఇష్టపడటం లేదు.
కూతురితో బయటకు వచ్చిన ప్రతిసారీ మీడియా వాళ్లు.. తమ కెమేరాలతో తన కుమార్తె ఫోటోను తీసేందుకు తెగ ట్రై చేస్తున్నా.. పాపాయి మొత్తాన్ని కవర్ చేసేలా ఏర్పాట్లు చేస్తూ బయటకు వస్తున్నాడట. ఇటీవల ఫ్యామిలీతో బయటకు వచ్చిన సందర్భంలో ఫోటో గ్రాఫర్లు పెద్ద ఎత్తున పాప ఫోటో తీసేందుకు ట్రై చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో చిన్నసైజు క్లాస్ పీకాడు. అంత మంది కెమేరామెన్లు అంత దగ్గర నుంచి ఫోటోలు తీస్తే.. చిన్నపిల్లల కళ్లు దెబ్బ తింటాయన్న ఆలోచన కూడా ఉండదా? అంటూ ట్విట్టర్ సాక్షిగా విరుచుకుపడ్డాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/