స్టార్లకు, బిజినెస్ పర్సనాలిటీలకు పెళ్లి చేసుకోవడం వరకూ టైమ్ దొరుకుతోంది కానీ, శోభనానికి, హనీమూన్ కి టైమ్ దొరకడం లేదు.బిజీ షెడ్యూల్స్ అనుకూలించక పాపం.. ఈ తిప్పలేవో తప్పడం లేదు. కళ్లముందే కాకినాడ కాజా ఊరిస్తున్నా కొరుక్కు తినలేని పరిస్థితి.
అప్పట్లో చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు పెళ్లి తర్వాత షూటింగుల బిజీ వల్ల హనీమూన్ కోసం వేచి చూడాల్సొచ్చింది. కాస్త తీరిగ్గా వీలు చూసుకుని మరీ విదేశీ టూర్లు పెట్టుకున్నారు. ఈ మధ్యనే హైదరాబాదీ అమ్మాయి దియా మీర్జా కూడా పెళ్లి చేసుకున్నా భర్తతో కలిసి హనీమూన్ వెళ్లడానికి కుదరలేదని చెప్పుకొచ్చింది. సొంత ప్రొడక్షన్ లో సినిమా షూట్ వల్ల వాయిదా వేసుకున్నామని చెప్పింది. అందుకే షూటింగ్ కాస్తా పూర్తయ్యాక.. ఓ వారంపాటు సుదీర్ఘమైన విదేశీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామని అసలు విషయం రివీల్ చేసింది. బిజీ జీవితంలో ఇవన్నీ మామూలే అనుకోవాల్సిన పరిస్థితి.
ఇటీవలే బాలీవుడ్ చాక్లెట్ బోయ్ షాహిద్ కపూర్ ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్ పుత్ ని పెళ్లాడాడు. షాహిద్ కూడా ఇంతవరకూ హనీమూన్ వెళ్లకుండా బిజీ షెడ్యూళ్లతో కుస్తీలు పడుతున్నాడు. ఓ వైపు సినిమా షెడ్యూల్స్, మరోవైపు బుల్లితెర కార్యక్రమాలతో షాహిద్ బిజీ. ఇప్పుడు అన్నిటికీ కామా పెట్టేసి భార్య మీరాతో కలిసి లండన్ వెకేషన్ కి వెళ్లిపోయాడు. హనీమూన్ అక్కడే. దాంతో పాటు భార్యాభర్తలిద్దరూ నమ్మే గురువు రాధాసోమిని కలవడానికి, ఆశీస్సులు తీసుకోవడానికి అక్కడికి వెళ్లారుట.