టాలీవుడ్ లో చాలామంది హీరోలున్నారు. మెగాస్టార్‌తో మొదలుపెడితే.. శర్వానంద్ వరకు దాదాపు 15 మందికిపైనే మన దగ్గరున్నారు. కానీ బాలీవుడ్ అనగానే అందరికి గుర్తొచ్చేది మూడు పేర్లే. వాళ్లే కింగ్ ఖాన్స్ సల్మాన్ - షారూక్ - అమీర్. ఈ ముగ్గురు బాక్సాఫీస్ కింగ్స్. సినిమా అట్టర్‌ఫ్లాప్ అయ్యిందనే టాక్ వచ్చినా కూడా ఈజీగా 200 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టగలరు ఈ ముగ్గురు తురుమ్‌ఖాన్‌లు.
అయితే అదంతా ఒకప్పుడు. ఇప్పుడు రోజులు మారాయి. కింగ్‌ఖాన్స్ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. ఈ ఏడాదిలో ఈ ముగ్గురు ఖాన్స్ నటించిన సినిమాలు అట్టర్‌ఫ్లాప్ అయ్యాయి. ఎంతలా అంటే… పోస్టర్స్ కోసం తయారు చేసిన మైదాపిండి ఖర్చులు కూడా తిరిగిరాని పరిస్థితి. అదే సమయంలో కుర్రహీరోలు రచ్చ రచ్చ చేస్తున్నారు. రణ్ బీర్ కపూర్ నటించిన సంజు దాదాపు రూ.350 కోట్లకు పైనే వసూలు చేసింది. ఇక డిసెంబర్‌లో విడుదలైన రన్వీర్ సింగ్ నటించిన శింబా రూ.100 కోట్లు దాటి దూసుకుపోతోంది. ఈ ఏడాది బాలీవుడ్ లో సత్తా చూపింది ఈ రణ్ బీర్ - రన్వీరే. అంటే ఇద్దరు కుర్రహీరోల ధాటికి ముగ్గరు ఖాన్స్ అల్లాడిపోయారు.
ప్రతీ ఏడాది ఒక ఖాన్ కాకపోతే.. ఇంకో ఖాన్ సత్తా చాటేవాడు. కానీ 12 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ బరిలో ఒక్క ఖాన్ కూడా లేకపోవడం 2018నే. దీంతో… షారూక్ -సల్మాన్ - అమీర్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందని భావిస్తున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.