బాలీవుడ్ ఆదర్శ దంపతుల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లు షారుక్ ఖాన్-గౌరీ. వీరి వివాహం 1991 అక్టోబర్ 25న ఢిల్లీలో జరిగింది. అంటే నేటికి వీరు ప్రేమ వివాహం చేసుకుని సంసార జీవిత ప్రయాణం మొదలుపెట్టి 25 ఏళ్లు పూర్తయిందన్నమాట. ఈ సందర్భంగా షారుక్ - గౌరీ ల జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం!!
షారుక్ తనకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడే గౌరీతో తొలిసారిగా తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడట. అప్పుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే! అయితే ఏదోలా కష్టపడి మొత్తానికి ఆమెను ఇంప్రెస్ చేసి సక్సెస్ ఫుల్ గా తన ప్రేమలో పడేసాడు. అనంతరం సుమారు ఐదేళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమ అయితే కులమతాలకు అతీతంగా ఎవరినా ప్రేమించుకోవచ్చు, మరి పెళ్లి విషయానికొచ్చేసరికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కదా!! అలాగే హిందూ బ్రాహ్మణ, శాఖాహార కుటుంబానికి చెందిన గౌరీ.. షారుక్ ఖాన్ ని ప్రేమిస్తున్న విషయం మాత్రం తన తండ్రితో చెప్పడానికి దైర్యం చేయలేదట. దీంతో గౌరీ తండ్రిని మెప్పించడానికి రంగంలోకి దిగిన షారుక్ వారి ఇంట్లో జరిగిన ఓ వేడుకకు హాజరై తనను తాను హిందువుగా పరిచయం చేసుకున్నాడట.
అలా సాగుతున్న వీరి ప్రేమ ప్రయాణంలో అందరిలాగానే వీరి మధ్య కూడా చిన్నచిన్న గొడవలు కూడా వచ్చాయట. ఈ క్రమంలో ఒక సారి గౌరీ, షారుక్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుని తన ఫ్రెండ్స్‌తో ముంబై వెళ్లి పోయిందట. ఈ విషయం తెలిసిన షారుక్.. ఎంతైనా హీరో కదా... తన తల్లికి ప్రేమ గురించి చెప్పి ఆమె వద్ద డబ్బు తీసుకుని ముంబై వెళ్లి అన్ని బీచ్ లూ ఎడతెరిపి లేకుండా వెతికేశాడట. అలా వెతుకుతున్న క్రమంలో చివరకు అక్షా బీచ్ లో గౌరీని కలిసాడట. ఆ సమయంలో ఇద్దరూ చాలా ఎమోషన్ కు గురయ్యారట. ఈ సీన్ విత్ క్యూట్ బ్యగ్రండ్ స్కోర్ తో ఊహించుకోండి. అప్పట్లో నే మనహీరో గారు దుమ్ములేపేశారన్న మాట! ఈమాత్రం ఎమోషన్ చాలు కదా... ఈ సంఘటనతో షారుక్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో గౌరీ అర్థం చేసుకోవడం, చివరి వరకు కలిసి జీవించాలని నిర్ణయించుకోవడం జరిగాయట!
కాగా, స్కూల్ లో ఉన్నప్పటి నుంచే ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెట్టిన షారుక్ - గౌరీ ఐదేళ్ల పాటు ఈ విషయాన్ని ఇంట్లో తెలియకుండా సీక్రెట్ గా ఉంచారు. షారుక్ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ పెళ్లికి గౌరీ తల్లిదండ్రులు ఏమాత్రం ఒప్పుకోలేదు. అనంతరం వీరి మధ్య ఉన్న ప్రేమ విషయం అర్థం చేసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లికి ఒప్పుకున్నారు.
ఈ క్రమంలో... షారుక్ చాలా సందర్బాల్లో, అనేక ఇంటర్వ్యూల్లో తన సక్సెస్ వెనక భార్య గౌరీ ఉందని, తన బలానికి, తనకు సంబంధించిన ప్రతి విషయానికి గౌరీ పిల్లర్ లాంటిదని చెబుతుంటారు. షారుక్ కూడా చాలా సందర్బాల్లో, అనేక ఇంటర్వ్యూల్లో తన సక్సెస్ వెనక భార్య గౌరీ ఉందని, తన బలానికి, తనకు సంబంధించిన ప్రతి విషయానికి గౌరీ పిల్లర్ లాంటిదని చెబుతుంటారు.
ఇది ఈ సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ... ఒక ముస్లింగ్ అబ్బాయి, ఒక హిందూ అమ్మాయి ప్రేమించుకున్నారు, ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు.. సక్సెస్ ఫుల్ గా పాతికేళ్ల సంసార జీవితాన్ని పూర్తిచేసుకున్నారు. ప్రేమంటూ ఉండాలే కానీ... వారికి ఏ విదమైన ఇహలోక అడ్డంకులూ సమస్యగా పరిగణించవని చెబుతోన్న ఈ ప్రేమ జంటకు కంగ్రాట్స్ అండ్ హ్యాపీ మేరేజ్ డే.. స్వీట్ క్యూట్ కపుల్ గౌరీ-షారుక్!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/