కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కథానాయకుడిగా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ తెరకక్కనున్నట్లు చాలా కాలంగా కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకూ ఆ కాంబినేషన్ చిత్రం పట్టాలెక్కలేదు. షారూక్ వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం.. ఏడాదిన్నరగా మహమ్మారి కరోనా కారణంగా అన్ని పనులు వాయిదా పడటంతో అట్లీ ప్రాజెక్ట్ కూడా డిలే అయింది. ఆ తర్వాత ఆ సినిమాపై అప్ డేట్స్ కూడా లేవు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి హాట్ అప్ డేట్ ఒకటి అందింది. సెప్టెంబర్ 10న అట్లీ సినిమాని పూణే లో లాంచ్ చేసి రెగ్యులర్ షూట్ కి వెళ్లేలా ప్రణాళిక సిద్దమవుతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. అలాగే ఇందులో హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే సునీల్ గ్రోవర్.. సన్యా మల్హోత్రా లాంటి బాలీవుడ్ నటులు కూడా భాగమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. చాలా గ్యాప్ దొరకడంతో అట్లీ ప్రాజెక్ట్ కి తుది మెరుగులు దిద్ది రెడీగా ఉండటంతో షారుక్ ఖాన్ డేట్లు కేటాయించినట్లు తెలిసింది. ప్రస్తుతం షారుక్ సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో `పఠాన్` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే పఠాన్ స్వదేశీ షెడ్యల్స్ మొత్తం పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో కొంత భాగం షూటింగ్ చేయాల్సి ఉంది.
దీంతో యూనిట్ త్వరలోనే యూరప్ ప్లైట్ ఎక్కనున్నట్లు సమాచారం. అక్కడి షెడ్యూల్స్ తో పఠాన్ షూటింగ్ పూర్తవుతుంది. అనంతరం అట్లీ ప్రాజెక్ట్ నే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అయితే ఇక్కడో చిక్కు ముడి ఉంది. రాజ్ కుమార్ హిరానీతో కూడా షారుక్ సినిమా చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్ ని అధికారికగా ప్రకటించారు. అట్లీ ప్రాజెక్ట్ అధికారికం కాకపోయినా యంగ్ డైరెక్టర్ వైపే షారుక్ ఆసక్తి చూపిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా సమాచారం. మరి అట్లీతో ప్రాజెక్ట్ నే ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తారా? సీనియర్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ ప్రాజెక్ట్ నే పట్టాలెక్కిస్తారా? అనేదానిపై మరోవైపు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కింగ్ ఖాన్ క్లారిటీనిస్తారేమో చూడాలి.
వలసదారుల జీవితాలపై సినిమా
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ మున్నాభాయ్ సిరీస్ తర్వాత పీకే.. సంజు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు షారూక్ తో ప్రయోగానికి ఆయన సన్నాహకాల్లో ఉన్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ - దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కొత్త ప్రాజెక్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ కాంబినేషన్ గురించి చాలా కాలంగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం స్క్రిప్టింగ్ పూర్తి చేసారని తెలిసింది.
బాలీవుడ్ వర్గాల కథనం ప్రకారం.. హిరాణీ అతని రచనా భాగస్వామి కనికా ధిల్లాన్ ఇటీవల స్క్రిప్ట్ ను పూర్తి చేసారు. ఇంతకుముందు హిరాణీ షారూఖ్ కి మరో కథను వివరించారు. కానీ దానిలో రెండవ భాగం ఆశించినంత బాగా లేనందున మేకర్స్ కొత్త కథపై పనిచేశారు. కొత్త స్క్రిప్ట్ షారక్ కి నచ్చింది. త్వరలోనే కాస్టింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారని తెలిసింది. హిరాణీ ఆస్థాన ఏజెంట్ ముఖేష్ ఛబ్రా క్యాస్టింగ్ పనులను చూస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ పన్నూ కథానాయికగా నటించేందుకు ఆస్కారం ఉందని తెలిసింది. సినిమా కథాంశం ఆసక్తికరం. వలసదారుల నేపథ్యంలో సాగే సామాజిక డ్రామా ఇది. ఈ చిత్రం చాలా భాగం కెనడాలో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2022 లో ప్రారంభమవుతుందని హింట్ ఉన్నా ఇప్పటికే అట్లీతో ప్రాజెక్ట్ చర్చనీయాంశమైంది. ప్రస్తుతం SRK తన తదుపరి చిత్రం పఠాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
పఠాన్ తో నిరూపించకపోతే ఇబ్బందే
వరుస పరాజయాలు కింగ్ ఖాన్ ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ పరాజయాలు అతడి ఉనికినే షేక్ చేశాయంటే అతిశయోక్తి కాదు. ఆయన ఎంత బాద్ షా అయినా వరుస ఫ్లాపులు మార్కెట్ వర్గాల్లో కల్లోలానికి కారణమయ్యాయి. `పఠాన్` చిత్రం నాలుగేళ్ల గ్యాప్ తో ప్రారంభించారు. ఈ చిత్రంతో ఖాన్ తన కంబ్యాక్ ని ఘనంగా చాటుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇప్పటికే మార్కెట్లో అతడి హవా కిందికి పడిపోయింది. గ్రాఫ్ ని ఒక్కసారిగా పైకి లేపాలంటే భారీ విజయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.