బాలీవుడ్ బాద్ షాగా పేరు తెచ్చుకున్న హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నుంచి సినిమా వచ్చి దాదాపుగా నాలుగేళ్లవుతోంది. `జీరో` డిజాస్టర్ కావడంతో ఆలోచనలో పడిన షారుఖ్ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ కుమార్ డైరెక్షన్ లో `జవాన్`, మనీష్ శర్మ డైరెక్షన్ లో `టైగర్ 3` తో పాటు యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిద్ధార్ద్ ఆనంద్ డైరెక్షన్ లో `పఠాన్` మూవీలో నటిస్తున్నాడు.
యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న `పఠాన్` వచ్చే ఏడాది జనవరి 25న అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇందులో షారుఖ్ ఖాన్ తో పాటు దీపికా పదుకోన్, జాన్ అబ్రహం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలోని కీలక అతిథి పాత్రల్లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ కనిపించబోతున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన ఈ మూవీ టీజర్ ఫ్యాన్స్ ని, యాక్షన్ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
ఐదు పదులు దాటిన వయసులోనూ షారుఖ్ ఖాన్ సిక్స్ ప్యాక్ బాడీతో తిరుగులేని ఫిట్ నెస్ తో కనిపిస్తున్న తీరుని చూసి ప్రేక్షకులు, అభిమానులు అవాక్కవుతున్నారట. టీజర్ లోని యాక్షన్ సన్నివేశాల్లో షారుఖ్ మెరుపు వేగంతో స్పందిస్తూ ప్రత్యర్థులని మట్టికరిపిస్తున్న తీరుకి ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
టీజర్ లో చూపించిన దానికి మించి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేశారట. అందులో నటించడానికి షారుఖ్ ఖాన్ చమటోడ్చాడని తెలుస్తోంది. షారుఖ్ బాడీ బిల్డింగ్ గురించి ఏ స్థాయిలో శ్రమించారో దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ తాజాగా వెల్లడించాడు. షారుఖ్ ఈ మూవీ కోసం ఎంతో అంకిత భావం, నిబద్ధతతో వర్క్ చేశాడని, ఈ వయసులోనూ ఈ స్థాయి ఫిట్ నెస్ తో కనిపించాలంటే ఎంత నిబద్ధత అవసరమని, అది షారుఖ్ లో కనిపించిందని స్పష్టం చేశారు. `పఠాన్`లో షారుక్ చూపించిన ఫిజిక్ కోసం ఆయన ఎంతగానో శ్రమించారన్నారు. టీజర్ చూసిన వారంతా అవాక్కవుతున్నారు.
దీంతో ఆయన కష్టానికి తగ్గ ఫలితం లభించిందని భావిస్తున్నాం. షారుఖ్ ని తొలిసారి కలిసినప్పుడు జరిగిన సంభాషణ ఇంకా నాకు గుర్తుందన్నారు. ముందు ఈ మూవీ కోసం శారీరక శ్రమ వుంటుందని మాట్లాడుకున్నాం. దాన్ని షారుఖ్ ఆచరణలో పెట్టడంతో ఇప్పడు దాని ఫలితం స్క్రీన్ పై కనిపిస్తోంది. సినిమా చూస్తున్నంద సేపు ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉరకలు వేయాలని అత్యంత ప్రమాదకర స్టంట్స్ చేశారట షారుఖ్. ప్రమాదకర ప్రదేశాల్లో ప్రమాదకరమైన వాతావరణంలో షారుఖ్ పై చిత్రీకరించిన యాక్షన్ ఘట్టాలకు థియేటర్లలో ఓ రేంజ్ అప్లాజ్ వచ్చి తీరుతుందని సిద్ధార్ధ్ ఆనంద్ చెబుతున్నారు.
దేశంలోనే అత్యంత భారీ యాక్షన్ సినిమాగా `పఠాన్ ` రాబోతోంది. ఇందులో మేము డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ల కోసం షారుఖ్ శ్రమించారు. ఆయన శ్రమకు ఫిదా అయిపోయామని, సినిమా పట్ల ఆయన అంకిత భావం ప్రేమని అర్థం చేసుకోవాలంటే ఈ మూవీ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే అన్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 25న అత్యంత భారీ స్థాయిలో విడుదల చేబోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.