గణతంత్ర దినోత్సవ కానుకగా బాలీవుడ్లో రెండు భారీ సినిమాలొచ్చాయి. సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్.. హృతిక్ రోషన్ తమ కొత్త సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ రెండు సినిమాలకు అందరూ అనుకున్నట్లే రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లలో షారుఖ్ సినిమా ‘రాయీస్’ కుమ్మేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లలో షారుఖ్ నుంచి సరైన మాస్ సినిమా రాలేదు. ‘రాయీస్’ ఆ లోటు తీర్చింది. వింటేజ్ షారుఖ్ ను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ సినిమాను బాద్ షా ఫ్యాన్స్ భలే ఎంజాయ్ చేస్తున్నారు. మాంచి మాస్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకుంది ‘రాయీస్’. ప్రథమార్ధం గ్రిప్పింగ్ గా ఉందని.. రెండో అర్ధం వీక్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఎబోవ్ యావరేజ్ రివ్యూలు వచ్చాయి. కానీ కలెక్షన్లు మాత్రం భారీగా ఉన్నాయి.
ఇక హృతిక్ మూవీ ‘కాబిల్’ విషయానికి వస్తే.. ఆ చిత్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. క్రిటిక్స్ ఈ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. కథాకథనాలు.. హృతిక్ నటన గురించి గొప్పగా చెబుతున్నారు. ఐతే ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని ఎంత మేరకు ఆకట్టుకుంటుందన్నది సందేహమే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. తొలి రోజు షారుఖ్ సినిమాతో పోలిస్తే వసూళ్లు కూడా బాగా తక్కువగానే వచ్చాయంటున్నారు. హృతిక్ ఇందులో అంధుడిగా నటించడంతో మాస్ ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించట్లేదు. అనుకోకుండా పోటీకి వచ్చిన ‘రాయీస్’ వల్ల ‘కాబిల్’కు గట్టి దెబ్బే తగిలేట్లుంది. రాకేష్ రోషన్ అన్నట్లు 150 కోట్లు కాకపోయినా ఆదాయంలో బాగానే కోత పడేట్లుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/