బాలీవుడ్ లో పెద్ద సినిమాలను సోలోగా రిలీజ్ చేసేలాగే ప్లాన్ చేస్తారు. కానీ జనవరి 25న షారూక్ ఖాన్ మూవీ రయీస్.. హృతిక్ రోషన్ నటించిన కాబిల్ లు పోటాపోటీగా రిలీజ్ అయ్యాయి. షారూక్ సినిమా 3500 స్క్రీన్స్.. హృతిక్ మూవీ 2700 స్క్రీన్స్ లో విడుదల కాగా.. తొలి రోజు నుంచి రయీస్ ఆధిపత్యం కనిపిస్తూనే ఉంది.
వారం మధ్యలో రిలీజ్ అయినా.. తొలి రోజు వసూళ్ల విషయంలో రయీస్ లో దాదాపు సగం మాత్రమే కాబిల్ రాబట్టగలిగింది. కలెక్షన్స్ అంకెల సంగతి పక్కన పెట్టినా.. థియేటర్ ఆక్యుపెన్సీ రేషియోలో చాలా తేడా కనిపిస్తోంది. ఓవరాల్ గా రయీస్ కి ఇప్పటివరకూ 65-70 శాతం మధ్య సీట్లు ఫుల్ అవుతుండగా.. కాబిల్ మాత్రం కేవలం 25-35 ఆక్యుపెన్సీ రేషియోతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కలెక్షన్స్ లో భారీ తేడా కనిపించడానికి ప్రధాన కారణం ఇదే అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. షారూక్ మూవీ మాస్ ఎంటర్టెయినర్ కావడం.. యాక్షన్ జోనర్ లో ఉండడంతో.. అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. కానీ హృతిక్ నటించిన కాబిల్ లో యాక్షన్ జోనర్ ఉన్నా.. క్లాస్ ఆడియన్స్ కి నచ్చే మూవీ అనే టాక్ కాసింత చేటు చేస్తోంది.
అయితే మెల్లగా రెండు సినిమాలకు ఆడియన్స్ పెరుగుతుండడం విశేషం. ఈ వారాంతంలో రెండు చిత్రాలకు దాదాపు అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్స్ పడుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండో రోజు కూడా ధియేటర్స్ లో దడదడలాడించిన రయీస్.. రెండు రోజులకు 46+ కోట్ల గ్రాస్ వసూలు చేస్తే.. రెండు రోజులకు కాబిల్ సినిమా 29+ కోట్లు వసూలు చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/