ఖాన్ లేడీ ప్రమోషన్లకు రాదని చెప్పాడట

Update: 2016-12-12 17:30 GMT
మొన్నామధ్యన విడుదలైన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను బాలీవుడ్ లో కొందరు ఏ రేంజులో ఏడిపించారో తెలిసిందే. సినిమాలో పాకిస్తానీ నటులు ఉన్నారు కాబట్టి.. సినిమాను రిలీజ్ చేయనివ్వం అంటూ శివసేన వార్నింగ్ ఇచ్చింది. ఆ తరువాత కరణ్‌ జోహార్ పాకిస్తాన్ నటులతో ప్రమోషన్ చేయనివ్వను.. సినిమాలో వారి పాత్రను (ఫవాద్ ఖాన్ రోల్) కత్తెరిస్తా అని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ షారూఖ్‌ ఖాన్ కూడా ఈ అంశంతో కాస్త ఇబ్బందులో పడే ఛాన్సుంది.

ఎందుకంటే షారూఖ్‌ ఖాన్ ''రయీస్'' సినిమాలో పాకిస్తానీ బ్యూటి మహీరా ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ అమ్మడుతో చేయాల్సిన కొన్ని పాటలను ఇప్పుడు షారూఖ్‌ ఏకంగా దుబాయ్ లో షూట్ చేయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కొన్ని లోకల్ పార్టీలు.. ఇలాంటి ఓవరాక్షన్ చేస్తే సినిమాను మడత పెట్టేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. దానితో ఆదివారం సాయంత్రం సీక్రెట్ గా మహారష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక్రేను కలిశాడు. సినిమా కోసం మహీరా ఖాన్ ఇక్కడ ప్రమోట్ చేయదని చెబుతూ.. ఇంకేవో చెప్పాడట. అలా స్వయంగా బాద్షా వచ్చి కలవడంతో.. సినిమాను రిలీజ్ ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోం అని ఎం.ఎన్.ఎస్ మాటిచ్చేసింది.
Tags:    

Similar News