హీరోగా ఈమద్య షారుఖ్ ఖాన్ కు ఏమాత్రం కలిసి రాలేదు. వరుసగా ఈయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. హీరోగా చేస్తున్న సినిమాలు ఫ్లాప్స్ అవుతున్న నేపథ్యంలో ప్రొడక్షన్ పై షారుఖ్ ఎక్కువ ఫోకస్ చేశాడు. ప్రస్తుతం ఈయన బేతాల్ అనే వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నాడు. అది ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నెట్ ప్లిక్స్ ద్వారా విడుదల కాబోతున్న బేతాల్ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవలే ట్రైలర్ విడుదల చేశారు. హర్రర్ సినిమా రేంజ్ లో విజువల్స్ ఉండటంతో ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ను మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు షారుఖ్ ఖాన్ కాంపిటీషన్ ఒకటి మొదలు పెట్టారు. షార్ట్ ఫిల్మ్ ను చిత్రీకరించి తమకు పంపించాల్సిందిగా షారుఖ్ కాంపిటీషన్ మొదలు పెట్టాడు.
తమకు వచ్చిన షార్ట్ ఫిల్మ్ ల్లో మూడు షార్ట్ ఫిల్మ్ లను విజేతలుగా ప్రకటిస్తామంటూ పేర్కొన్నారు. ఇందుకోసం కండీషన్స్ కూడా పెట్టారు. ఇంట్లోనే ఉండి తీయాలి.. ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి.. లాక్ డౌన్ నిబంధనలు పాటించే ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలని సూచించారు. కండీషన్స్ పెట్టినంత మాత్రన జనాలు వాటిని పాంటిచే షార్ట్ ఫిల్మ్ తీస్తారా అనేది అనుమానమే.
కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ఇలాంటి కాంపిటీషన్స్ నిర్వహించడం కరెక్ట్ కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ నిర్వహించే అవకాశం ఉందని.. షూటింగ్ సమయంలో సామాజిక దూరం కూడా పాటిస్తారో లేదో కూడా తెలియదు. అందుకే షారుఖ్ కాంపిటీషన్ ను తప్పుబడుతున్నార. వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం షారుఖ్ చేస్తున్న ఈ ప్రయత్నం విమర్శల పాలవుతోంది.