అంతరిక్షం నేపథ్యంలో సినిమాలు అంటే స్పేస్ ఒడిస్సీ - గ్రావిటీ లాంటి హాలీవుడ్ సినిమాలు గుర్తుకొస్తాయి. జీరో గ్రావిటీ స్పేస్‌లో ప్రయోగాలు మిస్ ఫైర్ అయితే - సైంటిస్టులు ప్రమాదంలో పడితే ఎలా ఉంటుంది? సైంటిస్టుల జీవితాలు దేశ రాజకీయాలతో ఎలా ముడిపడి ఉంటాయి? .. ఈ తరహా కథాంశాలతో హాలీవుడ్‌లో స్పేస్ సినిమాలొచ్చాయి. మొన్నటికి మొన్న జయం రవి నటించిన స్పేస్ మూవీ `టిక్ టిక్ టిక్` కాన్సెప్టు ఇదే తరహా. ప్రస్తుతం అన్ని పరిశ్రమల్లోనూ స్పేస్ బ్యాక్ డ్రాప్ మూవీలపై ఆసక్తి పెరిగింది. భారీ ప్రయోగాలతో యూనివర్శల్ మార్కెట్ ని కొల్లగొట్టడంలో భాగంగా ఈ ప్రయత్నం రెట్టింపు అవుతోంది.
టాలీవుడ్ లో వరుణ్ తేజ్ కథానాయకుడిగా `ఘాజీ` ఫేం సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో `అంతరిక్షం 9000 కెఎంపిహెచ్` తెరకెక్కుతోంది. ఇటీవలే రిలీజైన టీజర్ ఆకట్టుకుంది. స్పేస్ లో ప్రమాదాల నేపథ్యం టీజర్ లో ఎలివేట్ చేసారు. ఆక్సిజన్ అందని చోట అంతరిక్షంలో చిక్కుకుపోతే ఏం జరుగుతుంది? అన్నది ఉత్కంఠ రేకెత్తించింది. ఇకపోతే ఆర్.మాధవన్ - సుశాంత్ సింగ్ రాజ్ పుత్ - షారూక్ ఖాన్ లాంటి హీరోలు ఇతరత్రా స్పేస్ చిత్రాల్లో నటిస్తూ వేడి పెంచుతున్నారు.
తాజాగా కింగ్ ఖాన్ షారూక్ నటిస్తున్న స్పేస్ మూవీ టైటిల్ ని ప్రకటించారు. ఇంతకాలం ఈ సినిమాకి `సెల్యూట్` అనే టైటిల్ అనుకున్నా ఇప్పుడది మారింది. స్పేస్ సైంటిస్ట్ రాకేష్ శర్మ జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. `భోపాల్ ఎక్స్ ప్రెస్` ఫేం మహేష్ మాథాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్దార్థ్ రాయ్ కపూర్- రోనీ స్క్రూవాలా సంయుక్తంగా రాయ్ కపూర్ ఫిలింస్- ఆర్ఎస్‌వీపీ ఫిలింస్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్ నీతి - గులామ్ - ది లెజెండ్ ఆఫ్ భగత్ చిత్రాల రచయిత అంజుమ్ రాజబాలి స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అంతకుముందే కాస్టింగ్ ని ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది. వరుణ్ తేజ్ స్పేస్ నేపథ్యంలో `అంతరిక్షం` మూవీ చేస్తున్న వేళ .. పలువురు స్టార్ హీరోలు స్పేస్ సినిమాలు చేయడంపై జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. ఇది వరుణ్ తేజ్ సినిమాకి ప్రచారం పరంగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు. `జాతీయ అవార్డ్` సినిమా `ఘాజీ` ఫేం సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడంతో వరుణ్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. వరుసగా స్పేస్ మూవీస్ వెల్లువ చూస్తుంటే భారతదేశం నుంచి హాలీవుడ్ కి గట్టి పోటీ తప్పదనే అర్థమవుతోంది.