ఈమద్య కాలంలో వెండి తెరతో పాటు పోటీగా బుల్లి తెర కూడా ఆధర చాలా ఎక్కువ ఉంది. అందుకే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు కూడా మంచి శాటిలైట్ బిజినెస్ జరుగుతోంది. ఇక బాలీవుడ్ సినిమాల శాటిలైట్ రైట్స్ సగం బడ్జెట్ ను రికవరీ చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈమద్య కాలంలో అసలు సక్సెస్ మొహం చూడలేదు. సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమాలన్నీ కూడా నష్టాలను మిగుల్చుతున్నాయి. ఇటీవల స్వీయ నిర్మాణంలో చేసిన 'జీరో' చిత్రం కూడా నష్టాలను మిగిల్చింది. వెండి తెర నష్టాలను మిగిల్చిన బుల్లి తెర మాత్రం షారుఖ్ కు ఏకంగా 200 కోట్ల లాభాన్ని తెచ్చి పెట్టింది.
షారుఖ్ నటించిన 22 పాత సినిమాల శాటిలైట్ రైట్స్ ను గుండు గుత్తగా ఒక ప్రముఖ టీవీ ఛానెల్ దక్కించుకుంది. ఈ ఢీల్ విలవ ఎంత అనే విషయం బయటకు రాలేదు. కాని అందులో షారుఖ్ వాటాగా దాదాపు 200 కోట్ల రూపాయలు వచ్చిందంటూ బాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. షారుఖ్ ఖాన్ చాలా ఏళ్లుగా కూడా తాను నటించిన ప్రతి సినిమాకు పారితోషికం తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటాలు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడు. అందుకే పాత సినిమాల శాటిలైట్ రైట్స్ ఇప్పుడు అమ్మడం ద్వారా వాటికి భారీ ఎత్తున షారుఖ్ లాభం పొందినట్లుగా తెలుస్తోంది.
షారుఖ్ గతంలో నటించిన స్వదేశ్ - ఓం శాంతి ఓం - దిల్ వాలే - ఫిర్ బి దిల్ హై హిందూస్తానీ - చెన్నై ఎక్స్ ప్రెస్ - హ్యాపీ న్యూ ఇయర్ - డియర్ జిందగీ - పహెలి - చమత్కార్ - అంజామ్ - రామ్ జానే చిత్రాలు ఇప్పటికే బుల్లి తెరపై వచ్చాయి. ఇవి కాకుండా ఇంకా పలు సినిమాలు కూడా బుల్లి తెరపై సందడి చేస్తున్నాయి. అందుకే ఈ చిత్రాలన్నింటిని ఆ ఛానెల్ భారీ మొత్తంకు దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. వెయ్యి కోట్ల వరకు ఈ ఢీల్ విలువ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.