ఐదేళ్ల ఆశల్ని సున్నా చుట్టేసింది

Update: 2018-12-22 15:30 GMT
అలోచించి టైటిల్ పెట్టారో లేక ఫలితాన్ని ముందే ఊహించారో తెలియదు కానీ షారుఖ్ ఖాన్ కొత్త సినిమా జీరో దారుణమైన డిజాస్టర్ గా మిగలడం అభిమానులను తీవ్రంగా బాధ పెడుతోంది. కోట్లాది రూపాయల బడ్జెట్ మరుగుజ్జుగా షారుఖ్ ఖాన్ సాహసం- వ్యాధిగ్రస్తురాలిగా అనుష్క శర్మ అద్భుత నటన-కత్రినా కైఫ్ గ్లామర్ ఇవేవి కాపాడలేకపోతున్నాయి. క్రిటిక్స్ మరీ తక్కువగా వన్ రేటింగ్ ఇవ్వడం అందులోనూ అంతో ఇంతో కాస్త బెటర్ గా రివ్యూలు ఇస్తాయి అనుకున్న నేషనల్ సైట్స్ సైతం కంటెంట్ ని చీల్చి చెండాడటం ఎవరూ ఊహించనిది. యావరేజ్ అనిపించుకున్నా చాలు షారుఖ్ వందల కోట్లు ఈజీగా లాగేస్తాడు.

అయితే ఇంత విపరీతమైన నెగటివ్ టాక్ రెండో రోజు నుంచే ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. దీని ఎఫెక్ట్ ఎలా ఉందంటే నార్త్ సైడ్ ముక్కు మొహం తెలియని యష్ కేజిఎఫ్ కు దీని కంటే బెటర్ టాక్ వచ్చి స్క్రీన్లు తగ్గకుండా నిలుస్తోంది. అయితే షారుఖ్ ఖాన్ కు ఇది మొదటిసారి కాదు. ఐదేళ్ళ నుంచి ఇవే దెబ్బలు తింటూనే ఉన్నాడు. 2014లో వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత బాద్షా హిట్ మొహమే చూడలేదు. అది కూడా విమర్శల పాలైన సినిమానే. కాకపోతే మాస్ ప్రేక్షకుల పుణ్యమా అని డబ్బులు తెచ్చింది. అంతే.

ఆ తర్వాత దిల్ వాలేతో మొదలుకుని ఫ్యాన్ తో కంటిన్యూ చేస్తూ డియర్ జిందగీతో కొనసాగిస్తూ జబ్ హ్యారి మెట్స్ సీజల్ దాకా తింటూనే ఉన్నాడు. ఇప్పుడు జీరో ఆ గాయాలు పోగొడుతుంది అనుకుంటే వాటి బాబులా తయారయ్యింది. ఈ ఏడాది ధియేటర్ నుంచి పారిపోయేలా చేసిన డిజాస్టర్స్ లో ఇప్పటిదాకా రేస్ 3 తగ్స్ అఫ్ హిందూస్తాన్ లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జీరో వీటిని ఓవర్ టేక్ చేసే పనిలో బిజీగా ఉంది. స్క్రిప్ట్ ల విషయంలో తప్పటడుగులు వేస్తే ఎంత పెద్ద స్టార్ అయినా మూల్యం చెల్లించాల్సిందే అని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ కావాలా.
    

Tags:    

Similar News