క్రిస్మస్ బరిలో రిలీజవుతున్న సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు ఎనిమిది నెలల విరామం అనంతరం క్రైసిస్ కొనసాగుతున్నా థియేట్రికల్ రిలీజ్ పేరుతో పలు చిత్రాలు హీట్ పెంచుతున్నాయి. టాలీవుడ్ లో `సోలో బ్రతుకే సో బెటర్` డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజవుతుంటే.. అటు రిచా చద్దా నటించిన బహుభాషా చిత్రం `షకీలా` థియేటర్లలో రిలీజవుతుండడం ఆసక్తికర కాంపిటీషన్ కి తెర తీసింది.
ఇటీవల చాలా సినిమాలు OTT ప్లాట్ ఫామ్ లలో విడుదలవుతున్నాయి. కానీ డిసెంబర్ 25 న థియేటర్లలో విడుదలకు సిద్ధమైన ఈ రెండు సినిమాలపై జనాల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమాలకు ఆదరణ ఎలా ఉండనుంది? అన్నది ఆసక్తిని పెంచుతోంది.
సాఫ్ట్-పోర్న్ స్టార్ షకీలా బయోపిక్ మహమ్మారి కారణంగా ఇన్నాళ్లు ఆలస్యమైంది. చాలా గ్యాప్ తరువాత థియేటర్లలో విడుదలయ్యే మొదటి పాన్-ఇండియన్ మూవీ కావడంతో షకీలా బయోపిక్ పై ఆసక్తి నెలకొంది. మరికొన్ని ప్రాంతీయ సినిమాలు ఈ మూవీతో పోటీపడనుండగా.. బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా హవా ఎలా ఉండనుంది? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నాలుగు దక్షిణ భారత భాషలు తెలుగు- తమిళం- మలయాళం- కన్నడలలో ఈ బయోపిక్ రిలీజవుతోంది. హిందీ వెర్షన్ ఐదవది. కాబట్టి ఇన్నిచోట్ల థియేటర్లకు జనం రావాలంటే కంటెంట్ లో మ్యాటర్ ఉందన్న టాక్ ఆరంభమే రావాల్సి ఉంది. తెలుగులో ‘సోలో బ్రతుకే సో బెటర్’ .. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ - సారా అలీ ఖాన్ నటించిన కూలీ నంబర్ 1 చిత్రాలు పోటీకి దిగుతున్నాయి. వీటన్నిటి నడుమా షకీలా మూవీ ఫేవరెట్ గానే బరిలో దిగుతోందన్న అంచనా ఉంది. ఇక ఇప్పటికే షకీలా టీజర్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ మూవీపై యూత్ కన్ను పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.