'స్క్విడ్ గేమ్' లోకి మోదీ, షా కూడా ఎంటర్ అయ్యారే!
ఏఐ మాయాజలంతా ఎలాంటి వండర్స్ రీక్రియేట్ అవుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఆర్టిఫిషియల్ ఇంటిలి జెన్స్ తో ప్రపంచాన్నే శాషించే పరిస్థితి
ఏఐ మాయాజలంతా ఎలాంటి వండర్స్ రీక్రియేట్ అవుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఆర్టిఫిషియల్ ఇంటిలి జెన్స్ తో ప్రపంచాన్నే శాషించే పరిస్థితి. ఇప్పటికే `స్క్విడ్ గేమ్` సిరీస్ తో ఏఐ ఓ ఆట ఆడుకుంటుంది. ఇటీవలే స్క్విడ్ గేమ్ లో సౌత్ స్టార్స్ అంతా రంగంలోకి దిగేసారు. వాళ్లంతా కలిసి గేమ్ ఆడితే ఎలా ఉంటుందో ఓ అభిమాని చూపించాడు.
స్టార్ హీరోలు చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, విజయ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్, అజిత్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ధనుష్, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్, త్రిష, రానా, బ్రహ్మానందం స్క్విడ్ గేమ్ లోకి ఎంట్రీ ఇస్తే ఇలా ఉంటుందో చూపించారు. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ రాజకీయ నాయకులు ఏఐ తో స్క్విడ్ గేమ్ లోకి ఎంటర్ అయ్యారు.
ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులుంతా గ్రీన్ సూట్ లో ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీరంతా పార్లమెంట్ కు వస్తున్నట్లుగా, సమావేశాల్లో పాల్గొన్న ట్లుగా చూపించారు. అలాగే స్పీకర్ ఓంబిర్లా బ్లాక్ డ్రెస్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నెటి జనుల్ని అలరిస్తుంది. వీడియోపై రకరకాల కామెంట్లు పడుతున్నాయి.
వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన `స్క్విడ్ గేమ్` వెబ్ సిరీస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే స్క్విడ్ గేమ్ రెండు సీజన్లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. నెట్ ప్లిక్స్ ర్యాంకింగ్ నే మార్చేసిన వెబ్ సిరీస్ ఇది. 92 దేశాల్లో నెట్ ప్లిక్స్ నెంబర్ వన్ గా ఉందంటే దానికి కారణం స్క్విడ్ గేమ్. రెండవ భాగానికి కొనసాగింపుగా మూడవ భాగాన్ని కూడా ప్రకటించారు.