నిత్యా మీనన్.. షేక్ హ్యాండ్ వద్దు, ముద్దుకు మాత్రం ఓకే..!

నిత్యా మీనన్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.

Update: 2025-01-11 01:30 GMT

నిత్యా మీనన్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలతో తన సహజమైన నటనతో అలరించిందీ బబ్లీ బ్యూటీ. అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, ఈ మధ్య కాలంలో ఇతర భాషల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం నాలుగు తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. వాటిల్లో 'కాదలిక్క నేరమిల్లై' మూవీ పొంగల్ కి రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో నిత్య ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వచ్చేలా చేసింది.

'కాదలిక్క నేరమిల్లై' సినిమాలో కోలీవుడ్ స్టార్ జయం రవికి జోడీగా నటించింది నిత్యా మీనన్. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నిర్మాణంలో, ఆయన సతీమణి కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల చెన్నైలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడని నిత్య, మరొకరికి ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

నిత్యా మేనన్ మాట్లాడటానికి స్టేజ్ మీదకు వచ్చే సమయంలో, అక్కడే ఉన్న ఈవెంట్ మేనేజర్ ఆమెకు స్వాగతం పలుకుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే అతనితో చెయ్యి కలపడానికి ఇష్టపడని నిత్య, ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్లుగా సైగలు చేసి దండం పెట్టి ఊరుకుంది. దీంతో ఆమెను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనికి కారణం నిత్య వేదిక మీదకు రావడానికి కొన్ని నిమిషాల ముందే, ఆమె మిస్కిన్ కు ముద్దు పెట్టడంతో పాటు జయం రవిని హగ్ చేసుకుంది.

'సైకో' సినిమా చేసిన చనువుతో డైరెక్టర్ మిస్కీన్ బుగ్గ మీద నిత్యా మీనన్ ముద్దు పెట్టింది. మిస్కిన్ సైతం ఆమె చేతిని కిస్ చేసాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన హీరో జయం రవిని ఆలింగనం చేసుకుంటూ కనిపించింది. కానీ ఈవెంట్ ఆర్గనైజింగ్ టీమ్ లోని వ్యక్తికి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో రెండు సందర్భాలను ఒకే వీడియోలోకి తీసుకొచ్చి, వరస్ట్ బిహేవియర్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వ్యక్తుల స్థాయిని బట్టి నిత్య ప్రవర్తిస్తోందని, ఇది సరికాదంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నిత్యా మీనన్ తెలుగులో చివరగా 'భీమ్లా నాయక్' మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడీగా కనిపించింది. గతేడాది తమిళ్ లో 'తిరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటుగా, ఉత్తమ నటిగా నేషనల్ ఫిలిం అవార్డ్ గెలుచుకుంది. ప్రస్తుతం ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో 'ఇడ్లీ కడాయి' అనే సినిమా చేస్తోంది. 'కాదలిక్క నేరమిల్లై' రిలీజ్ కు రెడీ అయింది. అలానే 'డియర్ ఎక్సెస్' తో పాటుగా విజయ్ సేతుపతితో నిత్య ఓ సినిమాలో నటిస్తోంది.

Tags:    

Similar News