నా కెరీర్ లో సెకండ్ టేక్ తీసుకోలేదు

Update: 2018-03-25 05:43 GMT
ఒక న‌టి 250 సినిమాలు చేయ‌టం చిన్న విష‌యం కాదు. అది కూడా శృంగార తార‌గా అంటే మామూలు విష‌యం కాదు. ద‌క్షిణాదిలో శృంగార తార అన్న వెంట‌నే ష‌కీలా అన్న పేరున చ‌ప్పున గుర్తుకు రాక మాన‌దు. తెర‌పై హాట్ అందాల‌తో నిద్ర లేకుండా చేసే ష‌కీలా.. తెర ముందుకు వ‌చ్చి నోరు విప్పితే.. ఆమెను అంత త‌ప్పులా ఫీల్ అయినందుకు క‌న్నీళ్లు రాక మాన‌దు

సినిమాటిక్ గా ఉండే ఆమె జీవితం.. జీవ‌న విధానం చూసిన‌ప్పుడు అయ్యో అనుకోకుండా ఉండ‌లేం. ష‌కీలా ఇప్ప‌టివ‌ర‌కూ 250 సినిమాల్లో నటించారు. ఇన్నేళ్లుగా సినిమారంగంలో ఉండి కూడా ఇప్ప‌టికి ఆమె క్రేజ్ ఇసుమంతైనా త‌గ్గ‌లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే..త‌న‌కు సంబంధించిన విష‌యాలు ఏవైనా స‌రే.. అడ‌గ‌ట‌మే త‌డువుగా ఓపెన్ గా ఉన్న‌ది ఉన్న‌ట్లు చెబుతుంది. మ‌రో విషాదం ఏమిటంటే.. ష‌కీల‌కు కోట్లాది మంది అభిమానులు కానీ.. ఆమె అభిమానులు ఎవ‌రూ తాము ష‌కీలా ఫ్యాన్ అని చెప్ప‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. ఆ మాట‌కు వ‌స్తే.. ఆమె ఇంట్లోని కుటుంబ స‌భ్యులు కూడా. ఇంత‌కు మించిన వేద‌న ఎవ‌రికి ఉంటుంది.

తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ష‌కీలా ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర విష‌యాల‌తో పాటు..త‌న వ్య‌క్తిగ‌త వివ‌రాల్ని వెల్ల‌డించారు. సంచ‌ల‌నంగా ఉన్న ఆమె చెప్పిన వివ‌రాలు చూస్తే..

త‌న కెరీర్ లో ఏ రోజూ సెకండ్ టేక్ తీసుకున్న‌ది లేద‌ని చెప్పారు ష‌కీలా. కావాలంటే.. త‌న ద‌ర్శ‌కుల్ని అడిగితే ఈ విష‌యాన్ని చెబుతార‌ని చెప్పింది. సెకండ్ టేక్ తీసుకోక‌పోవ‌టానికి కార‌ణం లేక‌పోలేదు. ఆమె చెప్పిన కార‌ణం వింటే అయ్యో అనుకోకుండా ఉండ‌లేం. సెకండ్ టేక్ తీసుకోలేద‌న్న మాట‌ను గ‌ర్వంగా కాదు..ఆవేద‌న‌తో చెప్పిన‌ట్లుగా అర్థ‌మైన‌ప్పుడు ష‌కీలా మీద మ‌రింత సానుభూతి పెర‌గ‌టం ఖాయం.

ఇంత‌కీ ష‌కీలా సెకండ్ టేక్ ఎందుకు తీసుకునేది కాద‌న్న‌ది ఆమె మాట‌ల్లోనే చూస్తే..

శృంగార స‌న్నివేశాలు చేస్తుండ‌టం బిడియంగా ఉండ‌దా? అని అడుగుతారు. నిజం చెబితే న‌మ్మ‌రేమో. ఛ‌.. నిజ‌మా? అని అంటారేమో కానీ.. నిజంగానే ఇప్ప‌టికీ శ‌రీరాన్ని ప్ర‌ద‌ర్శించేలా న‌టించ‌టం సిగ్గండి. శ‌రీరాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని ఏ ఆడ‌దీ అనుకోదు. నా దుర‌దృష్ట‌మేమో.. నాకన్నీ అలాంటి చాన్సులే వ‌చ్చాయి. అందుకే నేను సెకండ్ టేక్ తీసుకోను. ఒకేసారితో సీన్ బాగా చేసేస్తే.. పీడ వ‌దిలిపోతుందని అనుకుంటూ కెమెరా ముందుకు వెళ్లేదాన్ని. ఒక్క టేక్ లో చేయ‌టం కోసం నేను గంట‌ల కొద్దీ ప్రాక్టీస్ చేసేదాన్ని.. విశ్రాంతి ఉండేది కాదు.. నేను ప‌ని చేసే డైరెక్ట‌ర్‌.. కెమెరామేన్ ఎవ‌రినైనా అడగండి.. నా లైఫ్ లో నేను సెకండ్ టేక్ తీసుకున్నానా? అని. ఇంత ద‌మ్ముగా ష‌కీలా మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌దేమో?
Tags:    

Similar News