ష‌కీలాకు సిగ‌రెట్ అల‌వాటు చేసిన ఆ హీరోయిన్

Update: 2019-10-22 01:30 GMT
మ‌ల‌యాళ శృంగార చిత్రాల‌తో ఒక‌ప్పుడు కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేసింది ష‌కీలా. అయితే ఆ సినిమాల‌కు టాటా చెప్పేశాక త‌న జీవితంలో జ‌రిగిన అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తూనే ఉందామె. తాజాగా ఆమె త‌న‌కు సిగ‌రెట్ తాగే అల‌వాటు అంటుకోవ‌డం వెనుక కార‌ణాన్ని వెల్ల‌డించింది. ఒక‌ప్ప‌టి బాలీవుడ్ హీరోయిన్ - ప్ర‌స్తుత నిర్మాత పూజా భ‌ట్.. ష‌కీలాకు సిగ‌రెట్ అల‌వాటు చేసింద‌ట‌. ఇదేం చిత్రం అనిపించొచ్చు కానీ.. ఇదే నిజ‌మ‌ట‌. ఆ విష‌యాన్ని ష‌కీలా స్వ‌యంగా వెల్ల‌డించింది.

ఒక‌సారి చెన్నైలో అనుకోకుండా పూజా భ‌ట్‌ను క‌లిశాన‌ని.. ఆ స‌మ‌యంలో ఆమె సిగ‌రెట్ తాగే స్టైల్ త‌న‌కు చాలా న‌చ్చింద‌ని.. అప్పుడు ఆమే స్వ‌యంగా త‌న‌కు సిగ‌రెట్ ఇచ్చి తాగ‌మ‌ని చెప్పింద‌ని ష‌కీలా వెల్ల‌డించింది. అలా త‌న‌కు సిగ‌రెట్ అల‌వాటు అయింద‌ని.. త‌ర్వాత అదే బ‌ల‌హీన‌త‌గా మారిపోయింద‌ని.. ఎంత ప్ర‌య‌త్నించినా ఆ అల‌వాటును విడిచిపెట్ట‌లేక‌పోయాన‌ని.. ఇప్ప‌టికీ అది కొన‌సాగుతోంద‌ని ష‌కీలా చెప్పింది. మ‌రోవైపు తాను పెళ్లిచేసుకోక‌పోవ‌డం గురించి ష‌కీలా మాట్లాడుతూ.. త‌న జీవితంలో ఏడెనిమిది మంది మ‌గ‌వాళ్ల‌ను ఇష్ట‌ప‌డ్డ‌ట్లు చెప్పింది. అయితే ఎవ‌రిని పెళ్లాడినా.. విడాకులు కావ‌డం ఖాయ‌మ‌నే ఉద్దేశంతో పెళ్లి చేసుకోలేదంది. ఒక వ్య‌క్తిని పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నాన‌ని.. కానీ అత‌డితో పెళ్లికి త‌న త‌ల్లి ఒప్పుకోలేద‌ని.. దీంతో ఆ స‌మ‌యంలో వ‌చ్చిన సంబంధాల‌న్నీ చెడ‌గొట్టుకున్నాన‌ని అంది. త‌న బాయ్ ఫ్రెండ్స్ త‌న‌ను హింసించార‌ని.. పెళ్లి కాకుండానే ఇలా చేస్తే పెళ్ల‌యితే ఇంకెలా ఉంటారో అని ఎవ‌రితోనూ పెళ్లి వైపు అడుగులు వేయ‌లేద‌ని ష‌కీలా చెప్పింది.
Tags:    

Similar News