అర్జున్ రెడ్డి బ్యూటీ చిలిపి ఎక్స్ ప్రెష‌న్ వైర‌ల్

Update: 2021-03-31 16:30 GMT
అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే ఇటీవ‌ల టాలీవుడ్ కి పూర్తిగా దూర‌మైంది. దానికి కార‌ణ‌మేమిటి? అన్న‌ది ఆరా తీస్తే.. ఇదీ సంగ‌తి. షాలిని నిశ్శ‌బ్ధం` ఫ్లాప‌య్యాక సైలెంట్ గా బాలీవుడ్ కి వెళ్లి అక్క‌డ బిజీ అయిపోయింది. ఈ బ్యూటీ జ‌యేష్ భాయ్ జోర్దార్.. మ‌హారాజా అనే రెండు హిందీ చిత్రాలకు సంత‌కాలు చేసింది. జ‌యేష్ భాయ్ లో ర‌ణ‌వీర్ సింగ్ లాంటి క్రేజీ హీరో స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కించుకుంది. అలాగే  మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మ‌హారాజా చిత్రంలోనూ అవ‌కాశం అందుకుంది.  

ఈ రెండు సినిమాల‌తో షాలిని షెడ్యూల్స్ ఫుల్ గా లాక్ అయ్యాయ‌ట‌. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో న‌టిస్తూనే ద‌క్షిణాదిపైనా దృష్టి సారిస్తోంద‌ట‌. అయితే షూట్ గ్యాప్స్ లో ఈ భామ ప్ర‌ఖ్యాత కార్పొరెట్ బ్రాండ్ల‌తో కాంట్రాక్టులు కుదుర్చుకుని యాడ్ షూట్ల‌లోనూ పాల్గొంటోంది. తాజాగా షాలిని పాండే కొత్త లుక్ రిలీజైంది.

ఈ ఫోటోలో షాలిని ఎంతో చిలిపిగా అల్ల‌రిగా క‌నిపిస్తోంది. బ్లూ డెనిమ్ షార్ట్ .. కాంబినేష‌న్ లూజ్ టీష‌ర్ల్ లో క‌నిపించింది షాలిని. బ్యాక్ గ్రౌండ్ లో వాల్ పై గ్రాఫిటీ క‌ళ హైలైట్ గా క‌నిపిస్తోంది. బ‌హుశా ఇది ప్ర‌క‌ట‌న లో న‌టించేప్ప‌టి ఫోటోనా ఏదైనా స్పెష‌ల్ ఫోటోషూట్ అని అనుకోవాలా?  షాలినియే చెప్పాల్సి ఉంటుంది. మిరాకిల్స్ ఆర్ వైబ్రేంట్ అంటూ ఓ వీడియో స్నాప్ కి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించి స‌స్పెన్స్ మెయింటెయిన్ చేస్తోంది ఇప్ప‌టికి.
Tags:    

Similar News