విజయ్ దేవరకొండ-షాలినీపాండే జంటగా నటించిన 'అర్జున్ రెడ్డి' కల్ట్ క్లాసిక్ హిట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క విజయం విజయ్ కి పాన్ ఇండియాలో గుర్తింపు తీసుకొచ్చింది. విజయ్ రేంజ్ నే మార్చేసింది. నేటి 'లైగర్' వరకూ వచ్చాడంటే కారణం ఆ ఒక్క హిట్ అనే చెప్పాలి. అదే సక్సెస్ తో ఇప్పడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తోనూ అవకాశం తెచ్చి పెట్టింది.
ఇలా విజయ్ కెరీర్ కి పూల బాట వేసిన చిత్రమది. కానీ షాలిని పాండే గుర్తింపు అయితే తీసుకొచ్చింది గానీ..అవకాశా పరంగా ఒరిగిందేం లేదు. కొన్ని సినిమాల్లో నటించింది గానీ..ఆసక్సెస్ ని కొనసాగించలేకపోయింది. తాజాగా విజయ్ కి షాలిని కృతజ్ఞతలు తెలియజేసింది. ఆగస్ట్ 25 తన జీవితంలో మఖ్యమైన డే అంటూ చెప్పుకొచ్చింది.
"ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యం. సుమారు ఐదేళ్ల క్రితం ఇదే రోజున నేను నటిగా వెండి తెరకు పరిచయం అయ్యాను. 'అర్జున్ రెడ్డి' విడుదల తేదీ ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమాలో నేను పోషించిన ప్రీతి పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనకి..దక్కిన ప్రేమకి ఎప్పుడూ రుణపడే ఉంటాను. తొలి చిత్రం ఎలా చేస్తానో అన్న భయం ఉండేది.
కానీ విజయ్ నాలో ఉత్సాహాన్ని నింపాడు. భయాన్ని.. కంగారు తొలగి పోయేలా చేసాడు. అప్పటి నుంచి షూటింగ్ ఎంతో సరదాగా సాగిపోయేలా చేసాడు. ఆ రకంగా విజయ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. లవ్ యూ విజయ్. నీ లైగర్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చారు.
ప్రస్తుతం షాలిని పాండే బాలీవుడ్ లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తుంది. ఇక బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. రేర్ గా టెంప్టిగ్ ఫోజులతో యువతలో కాకలు పుట్టిస్తుంది. అయితే కొద్ది రోజులుగా బ్యూటీ ఇన్ స్టాకి దూరంగా ఉంటుంది. అప్ డేట్స్ ఆలస్యమవుతున్నాయి. మరి అమ్మడి బిజీకి కారణం ఏంటో? తెలియాలి.