ఎర్ర కోక‌ కిర్రెక్కిపోనీ! టీవీ న‌టి హాట్ షో!!

Update: 2021-11-11 16:30 GMT
పాపులర్ టీవీ `షో యే మేరీ లైఫ్ హై`లో తనదైన పెర్ఫామెన్స్ పాపుల‌రైన టీవీ యాంక‌ర్ కం న‌టి షామా సికిందర్. సోషల్ మీడియా క్వీన్ గా ఈ బ్యూటీ అభిమానుల‌కు మ‌రింత‌గా చేరువైంది. తన ఆకర్షణీయమైన ఫోటోషూట్ ల నుండి నిరంత‌రం అన్ లిమిటెడ్ గా ఫోటోల‌ను షేర చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక బికినీలో స్విమ్ సూట్ల‌తో ఈ బ్యూటీ మెంట‌లెక్కిస్తోంది.

షామా సికిందర్ ఇటీవ‌ల క్రాఫ్ట్ ను మెరుగుపర్చడమే కాకుండా ఆమె ఫిట్‌నెస్ .. గ్లామర్ కోటీన్ పై కూడా పనిచేశారు. అనేక టీవీ షోలు.. సినిమాల‌తో పాపుల‌ర‌య్యాక‌.. భారతీయ టెలివిజన్ లో ప్ర‌జ‌లు అత్యంత ఇష్టపడే ముఖాలలో ఒక‌రిగా వెలిగిపోతోంది షామా. ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్లకు పైగా అభిమానులను కలిగి ఉన్న ఈ బ్యూటీ తనవైన‌ మంత్రముగ్ధులను చేసే ఫోటోల‌తో సోషల్ మీడియాలో మంట‌లు పెడుతోంది. ఆకర్షణీయమైన ఫోటోషూట్ లు ఫ్యాషన్ అప్ డేట్ లను ఇస్తూనే.. ట్రావెల్ డైరీలతో తన అభిమానులను ఆటపట్టించడం షామాకు చాలా ఇష్టం.

షామా సికిందర్ అమెరికాకు చెందిన వ్యాపారవేత్త జేమ్స్ మిల్లిరాన్ తో దాదాపు రెండేళ్ల క్రితం నిశ్చితార్థం జరిగింది. వివాహం గురించి మాట్లాడుతూ.. షమా చాలా సంగ‌తులే చెప్పారు. మేము మా వివాహాన్ని ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. జేమ్స్ - నేను ఇద్దరూ వివాహ వ్య‌వ‌స్థ‌ను గట్టిగా విశ్వసించనందున ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో విఫలమవుతున్నాం. అలాగే మేము ఇప్పటికే వివాహం చేసుకున్నామని భావిస్తున్నాము. మేము జీవితాన్ని ఒక పెద్ద పార్టీ లాగా జరుపుకుంటాం. కాబట్టి మా పెళ్లి కూడా మన ప్రియమైన వారితో మరొక పార్టీలా అవుతుంది. ఏదో ఒక రోజు మనం సెలవులకి వెళ్లి హఠాత్తుగా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేద్దామా? అనే ఫీలింగ్ నాకు ఉంది. ప్రపంచం మొత్తాన్ని ఆహ్వానించడంపై నాకు నమ్మకం లేదు కాబట్టి నేను అలాంటిదే చేయాలనుకుంటున్నాను`` అంటూ చాలా గుంబ‌న‌గా మాట్టాడింది షామా.

తాజాగా షామా ఎర్ర చీరలో ప్ర‌త్య‌క్ష‌మై గుబులు రేపింది. ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో పొగ‌లు పుట్టిస్తోంది. షామా అల్ట్రా గ్లామ‌ర‌స్ అవ‌తార్ ని వాట్సాపుల్లో వైర‌ల్ గా షేర్ చేస్తోంది యూత్. షామా కెరీర్ ఆరంభం పేరు తెచ్చిన టీవీ షోల జాబితాని ప‌రిశీలిస్తే ..ఆమె CID బల్వీర్ వంటి సీరియల్స్ లో కనిపించింది. షామా దిల్ కి సన్ అనే వెబ్ సిరీస్ లోనూ న‌టించింది. మాయ అనే వెబ్ సిరీస్ లో కూడా షామా న‌ట‌న‌కు ఫ్యాన్స్ ఏర్పడ్డారు.


Tags:    

Similar News