ఫోటో స్టొరీ: హీటు పెంచిన హాటు బ్యూటీ

Update: 2018-09-19 12:30 GMT
సోషల్ మీడియా టెంపరేచర్ ను ఎప్పుడూ పెంచే ముంబై బ్యూటీలలో షామ సికందర్ పేరు మనం తప్పని సరిగా చెప్పుకోవాలి.  టీవీ నటిగా పాపులర్ అయిన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది.  ఇన్స్టా గ్రామ్ లో దాదాపు వన్ మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.  ఇక వారికోసం ఘాటు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఒక రెడ్ కలర్ మొనోకినిలో స్విమింగ్ పూల్ లో పోజిచ్చింది. అసలే బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్.. దాన్లో రెడ్ కలర్ మొనోకిని వేసుకున్న పాలరాతి శిల్పం లాంటి బ్యూటీ.. పైగా ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.  ఇక నెటిజనుల నిద్ర పాడవడానికి ఈ ఫోటో చాలు కదా.  వీటన్నిటికీ తోడుగా ఆమె ఇచ్చిన క్యాప్షన్ "సెక్సీనెస్ అనేది బాడీ షేప్ వల్ల రాదు.. ఆత్మ లో ఉండే ఫైర్ వల్ల వస్తుంది".  

ఈ ఫోటోలు లెక్కలేనన్ని లైకులతో పాటుగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఒకరు 'పానీ మె ఆగ్ లగాదీ ఆప్ నె' (నీళ్ళలో నిప్పు వెలిగించారు)  అంటే , మరొకరు 'నీ సోల్ లోని ఫైర్ నా సోల్ కి మంట పెట్టింది' అన్నారు.  ఏదేమైనా ఈ సెక్సీ ఆత్మ ఇన్స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియా మొత్తానికి హీట్ పెంచింది.  కాలం మారింది..  బ్యూటీల గురించి కాకుండా బ్యూటిఫుల్ ఆత్మల మంటల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తోంది!
Tags:    

Similar News