వీడియో: ప‌బ్లిక్ కోరింద‌ని చీర‌లో వ‌డ్డించేసింది

Update: 2022-09-20 04:25 GMT
షామా సికిందర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌టి గాయ‌ని కం హోస్ట్ గా సుప‌రిచితం. సోషల్ మీడియాలో తన నిరంత‌ర‌ పోస్ట్ లతో ఇంటర్నెట్ ను ఎప్పుడూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. టీవీ నటిగా తన అభిమానులను ఇన్ స్టాగ్రామ్ లో నిరంత‌రం ఫోటోలు వీడియోల‌తో అప్ డేట్ చేస్తుంది.

తాజాగా షామా శారీలో హొయ‌లొలికిస్తున్న ఓ వీడియోని షేర్ చేసింది. ప‌బ్లిక్ డిమాండ్ మేర‌కు మ‌రో వీడియో అంటూ షామా టీజ్ చేసింది. చీర‌లో అలా న‌డుమందాల‌ను ఆవిష్క‌రిస్తూ క్లాసిక్ హిందీ సాంగ్ కి త‌గ్గ‌ట్టు ఎక్స్ ప్రెష‌న్స్ తో మాస్ కి కిక్కు పుట్టించింది షామా.

ప్ర‌స్తుతం ఈ వీడియో ప‌బ్లిక్ లోకి వైర‌ల్ గా దూసుకెళుతోంది. అయితే షామాను మ‌రీ ఎవ‌రూ ఇంత ఘాటుగా ఫోజులివ్వాల‌ని కోరుకోలేదు. అలా రెచ్చ‌గొట్టి టీజ్ చేయ‌డం స‌రికాద‌ని కూడా కొంద‌రు రివ‌ర్స్ కౌంట‌ర్లు వేస్తున్నారు. మొత్తానికి ఒకే ఒక్క క‌వ్వింపుతో మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంది తెలివిగా.

మ‌రోవైపు తన భర్త జేమ్స్ మిల్లిరాన్ పుట్టినరోజు సంద‌ర్భంగా సుదీర్ఘ వెకేఏష‌న్ ని షామా ఎంజాయ్ చేసింది. అత‌డికి గుండెను ట‌చ్ చేసే కోట్స్ తో శుభాకాంక్షలు తెలియ‌జేసింది. అత‌డితో త‌న రొమాంటిక్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలను విడుద‌ల‌చేసింది. అతనిని తన జీవితంలో కలిగి ఉండటం తన అదృష్టమని పేర్కొంది. ఫోటోల బంచ్ లో ప్రతి ఫోటోలో ఈ జంట చాలా అందంగా కనిపిస్తున్నారు.

ఈ జంట బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ నుంచి వ‌రుస ఫోటోల‌ను కూడా షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి. షామా సికిందర్ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది. "హ్యాపీ బర్త్‌డే లవ్ జేమ్స్ మిల్లిరోన్... మీరు ఒక ఆశీర్వాద జీవి.. మీ స్పెష‌ల్ డే నిజంగా అర్హులైన ప్రతిదాన్ని నేను కోరుకుంటున్నాను.

మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు అంద‌రి ప్రేమ‌ను గౌర‌వాన్ని అందుకున్నారు. మీరు మీ చుట్టూ ఉన్న ప్రతిదానిని కేవలం మీరుగా చేయడం ద్వారా ప్రత్యేకంగా చేస్తారు. నా జీవితంలో మీరు నా కోసం ఉండటం చాలా అదృష్టం. "మిమ్మల్ని నావాడు" అని పిలుస్తాను... అంటూ ఎమోష‌న‌ల్ అయ్యింది షామా.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View


Tags:    

Similar News