ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ తిరగేస్తే.. ఒక కొత్త వాదన కాస్త గట్టిగానే వినిపిస్తోంది. అసలు రాజమౌళి పద్మశ్రీ అవార్డుకు అర్హుడా అనే క్వశ్చన్ గురంచి తెలిసిందే. అయితే ఈ డిస్కషన్ పక్కనెట్టేస్తే.. ఒక ప్రక్కన కేవలం బాహుబలి సినిమాతో జాతీయ ఖ్యాతి గడించిన రాజమౌళికే అవార్డును ఇచ్చినప్పుడు అసలు తమిళ దర్శకుడు శంకర్ కు ఎందుకివ్వలేదని తంబీలు కోప్పడుతున్నారు.
మసాలా చూపించైనా మాస్ ను ఆకట్టుకుంటున్న రాజమౌళికి అవార్డునిస్తే.. మరి అదే మసాలాతో సోషల్ మెసేజ్ కూడా చెబుతున్న శంకర్ కు ఇవ్వరా నాయనా అంటూ వారు ట్విట్టర్ ఫేస్ బుక్కుల్లో హోరెత్తిస్తున్నారు. జెంటిల్ మ్యాన్ నుండి మొన్న వచ్చిన ఐ సినిమా వరకు.. ప్రతీ సినిమాలోనూ సోషల్ మెసేజ్.. కరప్షన్ వంటి అంశాలతో ఆకట్టుకుంటూ.. ఎన్నో అదిరిపోయే కొత్త విషయాలను తన సినిమాల ద్వారా చెప్పిన శంకర్ కు ఎందుకు పద్మ అవార్డు అనేది ఇవ్వలేదు అంటూ వారు వాదిస్తున్నారు. ఆయన కూడా ఆర్టిస్టిక్ బ్రిలియన్స్ తో దేశానికి ఎంతో చేసినట్లే కదా అనేది వీరి మాట.
ఇకపోతే శంకర్ కు ఇప్పటివరకు కేవలం తమిళనాడు స్టేట్ అవార్డుతో పాటు.. ఫిల్మ్ ఫేర్ అవార్డులు మాత్రమే వచ్చాయి. ఎన్నడూ కనీసం నేషనల్ అవార్డులు కూడా రాలేదు. ఎందుకు ఏమిటి ఎలా అనేది తంబీలకే తెలియాలి.