#RC15 పై న‌మ్మ‌కం పెంచిన శంక‌ర్

Update: 2022-10-10 04:22 GMT
RRR తర్వాత రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత ఖరీదైన చిత్రం #RC15 అని క‌థ‌నాలొస్తున్నాయి. చ‌ర‌ణ్ వెంట వెంట‌నే పాన్ ఇండియా ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయాల‌నుకున్నాడు. అదే క్ర‌మంలో అత‌డు శంక‌ర్ తో జ‌త‌క‌ట్టాడు. ఈ చిత్రానికి దిల్ రాజు అసాధార‌ణ బ‌డ్జెట్ ని వెచ్చించార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే శంక‌ర్ కి ఉన్న కోర్టు చిక్కుల వ‌ల్ల సినిమా ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో నిర్మాణ వ్య‌యం పెరుగుతోంద‌ని గుస‌గుస‌లు కూడా వైర‌ల్ అయ్యాయి. ఓవైపు భార‌తీయుడు 2 చిత్రీక‌ర‌ణ‌కు వెళుతూనే ఇటు ఆర్.సి 15 షెడ్యూళ్ల‌ను శంక‌ర్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో దిల్ రాజులో కొంత క‌ల‌త తీరింద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ఇప్పటివరకు ఆర్.సి 15 చిత్రం 50 శాతం పూర్త‌యింది. శంక‌ర్ ఇటీవల తిరుపతిలో భారతీయుడు 2 షెడ్యూల్ ను ముగించాడు. ఇప్పుడు అతను #RC15 యొక్క 10 రోజుల షెడ్యూల్ ను వేగంగా పూర్తి చేయ‌డానికి రాజమండ్రి వెళ్లాలనుకుంటున్నాడు. ఈ రెండ్రోజుల‌లోనే చరణ్-శంకర్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని క‌థ‌నాలొస్తున్నాయి. ఇక ఇప్ప‌టివ‌ర‌కూ చిత్రీక‌రించిన ఔట్ పుట్ పై దిల్ రాజు సంతృప్తిగానే ఉన్నార‌నేది మ‌రో టాక్.

చరణ్ ఈ ప్రాజెక్టులో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నారు. దిల్ రాజుతో క‌లిసి ప‌నులు చ‌క‌చ‌కా పూర్త‌య్యేందుకు స‌హ‌క‌రిస్తున్నారు. ఇప్ప‌టికే సంగీతం కోసం థ‌మన్ తో కూర్చొని పనిని పూర్తి చేయడం ద్వారా #RC15 పై భ‌రోసా పెరుగుతోంద‌ని సమాచారం. తాజా స‌మాచారం మేర‌కు ఈ ప‌ది రోజుల షెడ్యూల్ ని శంకర్ త్వరగా ముగించాలనుకుంటున్నారు.

టైటిల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు?

ఆర్.సి 15 కోసం చర‌ణ్ రేయింబ‌వ‌ళ్లు ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ త‌ర‌హాలోనే మ‌రోసారి మ్యాసివ్ పాన్ ఇండియా హిట్ కొట్టాల‌న్న‌ది అత‌డి పంతం. ఇక ఆర్.సి 15 కంటెంట్ పైనా టైటిల్ పైనా చర‌ణ్ ఎక్కువ ఆస‌క్తిగా ఉన్నారు. ఇప్పుడు టైటిల్ ని ఫైన‌ల్ చేయాల్సిన టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది.

త‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు శంక‌ర్- దిల్ రాజుతో చ‌ర‌ణ్ దీనిపై చ‌ర్చోచ‌ర్చ‌లు సాగిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే టైటిల్ పై ఏకాభిప్రాయం కుదిరిందా? అంటే జ‌వాబు లేదు. నిజానికి ఈ చిత్రానికి స‌ర్కారోడు! అనే టైటిల్ ని ఎంపిక చేయాల‌ని దిల్ రాజు భావిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే శంక‌ర్ మాత్రం ఆఫీస‌ర్ (అధికారి) అనే టైటిల్ పై మొగ్గు చూపుతున్నార‌ని గ‌తంలో క‌థ‌నాలొచ్చాయి.. స‌ర్కారోడు వ‌ర్సెస్ ఆఫీస‌ర్!  ఈ రెండిటిలో ఏది బెస్ట్ అన్న‌ది తేలాల్సి ఉందిట‌. అయితే చ‌ర‌ణ్ మాత్రం శంక‌ర్ ఎంపిక చేసుకున్న ఆఫీస‌ర్ టైటిల్ ని ఫైన‌ల్ చేయాల్సిందిగా సూచించిన‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. ఆఫీస‌ర్ టైటిల్ ఎంతో క్లాసీగా ఉంది. అలాగే దీనికి యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ కూడా ఉంది. కానీ దిల్ రాజు ఎంపిక చేసుకున్న స‌ర్కారోడు మాసీగా ఉంది. పైగా పూర్తి లోక‌ల్ టైటిల్ ఇది. దీనికి పాన్ ఇండియా రీచ్ క‌నిపించ‌డం లేదని విశ్లేషిస్తున్నారు.

ఒక‌ నిజాయితీ గల IAS అధికారి జీవితం ఎలా సాగింది? అన్న కాన్సెప్టుతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో చ‌ర‌ణ్ సీఎం పాత్ర‌లోనూ క‌నిపిస్తార‌న్న టాక్ ఉంది. అందుకే చ‌ర‌ణ్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు ఆఫీస‌ర్ లేదా అధికారి యాప్ట్ టైటిల్ అని కూడా చెప్పొచ్చు. కానీ సుదీర్ఘ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం చివ‌రికి ఏ టైటిల్ ని ఫైన‌ల్ చేస్తారు? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆ రెండు టైటిల్స్ కాకుండా మెగాభిమానులు ఇంకేదైనా యూనివ‌ర్శ‌ల్ త‌ర‌హా న‌వ్య‌పంథా టైటిల్ ని చెబుతారేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News