లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గురించి ఆయన సంగీతం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. సీజన్ మారగానే మర్చిపోయే పాటల మాదిరిగా కాకుండా సీజన్లు మారుతున్నా.. వాతవరణంలో మార్పులొస్తున్నా ఎప్పుడూ ఉండే గాలిలాగా అయన స్వరపరిచిన పాటలు శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది నిద్రపోయే ముందు రెగ్యులర్ గా ఇళయరాజా మెలోడీలు వినేవారు ఉన్నారంటే అదేమీ అతిశయోక్తి కాదు. మరి అలాంటి అద్భుత సంగీత దర్శకుడితో శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ఒక్కసారి కూడా ఎందుకు పని చేయలేదు?
ఇది నిజంగా ఎవరైనా ఆశ్చర్యపోయే అంశమే. ఎంతోమంది యువదర్శకులు.. ఈ జెనరేషన్ వారు ఆయనతో పని చేసినా శంకర్ - ఇళయరాజా కాంబో ఎందుకు వర్క్ అవుట్ కాలేదు? ఇలాంటి ప్రశ్నలకు రీసెంట్ గా శంకర్ స్వయంగా సమాధానం ఇచ్చాడు. శంకర్ తన మొదటి సినిమా 'జెంటిల్ మేన్' సినిమాకు ఆయనతో పని చేయాల్సిందట. ఆయనను సంగీత దర్శకుడిగా ఎంచుకుని అయన అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నాడట. కానీ ఆయన పట్ల ఉన్న గౌరవం.. భయం వల్ల ఆయనతో మాట్లాడలేకపోయాడట.
ఇళయరాజా గురించి శంకర్ వివరిస్తూ "ఆయనొక మ్యూజిక్ డిక్షనరీ. అయనతో పనిచేయాలంటే నాకుండే నాలెడ్జ్ సరిపోదనిపించ్చింది. దానికి తోడు అయనంటే ఉండే భయం.. గౌరవం వల్ల ఆయనను అది కావాలి.. ఇది కావాలి.. ఇలా చేయాలి.. అలా చేయాలని చెప్పలేను. అందుకే రాజా సార్ తో పనిచేయలేదు" అన్నాడు. తర్వాత ఆ సినిమాకు రెహమాన్ ను ఎంచుకున్నామని.. తర్వాత సినిమాలకు అతనితోనే జర్నీ సాగిందని తెలిపాడు. ఇళయరాజా గారితో సంగీతం చేయించుకోలేకపోయినా ఆయనతో కలిసి ఒక యాడ్ లో నటించానని గర్వంగా చెప్పాడు శంకర్.