ఇంతకాలం `రోబో 2` పనుల్లో బిజీగా ఉన్న శంకర్‌కి ఇప్పటికి తీరిక సమయం చిక్కినట్టే అనిపిస్తోంది. నవంబర్ 29న `2.ఓ` (రోబో2) చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేస్తామని ఖరాకండిగా చెప్పేసిన శంకర్ ఆ మేరకు వీఎఫ్ ఎక్స్ టీమ్ ని తీవ్రంగానే హెచ్చరించారని మాట్లాడుకున్నారు. ఇప్పటికే మెజారిటీ పార్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవ్వడం - పెండింగ్ పనుల్ని వేగంగా పూర్తి చేస్తుండడంతో శంకర్‌కి కాస్తంత రిలాక్స్ టైమ్ చిక్కింది. ఈ టైమ్ లోనే అతడు నెక్ట్స్ మూవీకి యుద్ధం స్టార్ట్ చేసేశారు.
ముందే ప్రకటించినట్టే `భారతీయుడు -2` సన్నాహకాలు సీరియస్ గానే సాగుతున్నాయి. ఇప్పటికే లొకేషన్ల వేటను ప్రారంభించారు. ఈ వేటలో శంకర్ తో పాటు ఛాయాగ్రాహకుడు రవివర్మన్ ఉన్నారు. శంకర్- రవివర్మన్ ఇద్దరూ కలిసి ఏకంగా హెలీకాఫ్టర్ లో లొకేషన్ వేటకు వెళ్లడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అదేదో వరద బాధితుల్ని పరామర్శించడానికి ప్రభుత్వ బృందం బయల్దేరినట్టు.. ఆ ఇద్దరూ ఇంత సీరియస్ గా హెలీకాఫ్టర్ లో లొకేషన్ వేట సాగించడమేంటో అర్థంకాక ఒకటే కన్ఫ్యూజన్ లో పడిపోయారంతా. ఏదైతేనేం నవంబర్ లో 2.ఓ రిలీజైపోయి, ప్రచారం ముగించేస్తే ఇక `భారతీయుడు 2` సెట్స్ కెళ్లిపోయేందుకు శంకర్ ప్రిపేరైపోయినట్టే.
ఇప్పటికే తమిళ్ టాప్ రైటర్లు స్క్రిప్టును రెడీ చేశారు. ఇందులో రోబో 2 రైటర్ జేయ మోహన్ పనితనం కనబరుస్తున్నారుట. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నేటి ట్రెండ్ కి తగ్గట్టు - వర్తమాన సమాజంలో అవినీతి - దోపిడీపై సాగించే యుద్ధంగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నారట. ఆ మేరకు కమల్ హాసన్ ఇచ్చిన ఐడియాని శంకర్ డెవలప్ చేయడం ఇదివరకూ చర్చకొచ్చింది. `భారతీయుడు` రిలీజైన రెండు దశాబ్ధాలకు ఈ ప్రయత్నం సాగడం సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. కమల్ హాసన్ ఓవైపు రాజకీయాల్లో బిజీ అవుతున్నందున ఈ చిత్రంలో అజయ్ దేవగన్ లాంటి స్టార్ నటించే అవకాశం ఉందన్న స్పెక్యులేషన్స్ కొత్త సమీకరణాలకు తావిస్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి తెచ్చేందుకు శంకర్ పూర్తి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.