మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ తొలిసారి నటించిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీ రిలీజ్ కోసం మెగా అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. సంక్రాంతి సీజన్ లో జనవరి 7న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడటంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి లోనయ్యారు.
తాజాగా ఈ మూవీ టీమ్ మార్చి 18న లేదా ఏప్రిల్ 28న ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ ప్రకటించింది. ఈ రెండు డేట్ లలో ఒకటి త్వరలో ఫైనల్ కాబోతోంది. ఇదిలా వుంటే `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వాయిదా పడటంతో రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి వెళ్లిపోయారు. చరణ్ ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్` తరువాత శంకర్ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొంత వరకు పూర్తయింది.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే సినిమాగా ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కిస్తున్నారని, ఇందులో చరణ్ ఐఏఎస్ అధికారికగా, ముఖ్యమంత్రిగానూ కనిపించబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో షాకింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది. శంకర్ సినిమా అంటే మొదటి నుంచి గ్రాండీయర్ లుక్ కచ్చితంగా వుండాల్సిందే. అంతే కాకుండా టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో వుంటాయి. ఇక శంకర్ సినిమాల్లో పాటలకు ప్రత్యేకత వుంటుంది. ఒక్కో పాట కోసం భారీగా సెట్స్ వేయించి సరికొత్త థీమ్ తో వాటిని చిత్రీకరిస్తూ వుంటారు. హీరోని రాజుగా చూపిస్తూ పాటలోనే కొత్త కథ చెప్పడం శంకర్ కు అలవాటు.
అలా జెంటిల్మెన్, శివాజీ, భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి చిత్రాల్లో ఆయన ఓ కాన్సెప్ట్ నేపథ్యంలో చిత్రీకరించిన పాటలు ఇప్పటికీ హైలైట్ గా నిలిచాయి. ఇదే తరహాలో చరణ్ మూవీ కోసం కూడా శంకర్ ఓ పాటని ప్రత్యేకంగా చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట కోసం ఏకంగా శంకర్ 25 కోట్లు ఖర్చు చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కేవలం పాట కోసం 25 కోట్లు ఏంటి సామీ అని అంతా అవాక్కవుతున్నారు. ఈ పాట కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారట. ఆ కారణంగానే దీనికి 25 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు.