ఇటీవలి కాలంలో స్టార్ డైరెక్టర్ శంకర్ తీవ్ర వివాదాలతో హెడ్ లైన్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. భారతీయుడు 2 విషయంలో లైకా సంస్థతో వివాదం ఇప్పటికీ కోర్టుల పరిధిలో ఉంది. అయితే రామ్ చరణ్ తో శంకర్ ఆర్.సి 15 చిత్రీకరణకు ఇది అడ్డంకి కాలేదు. మరోవైపు భారతీయుడు 2 విషయంలో లైకాతో శంకర్ సమస్యను పరిష్కరించేందుకు కమల్ హాసన్ మధ్యవర్తిత్వం నెరపనున్నారని ఇటీవల కథనాలొచ్చాయి. నిర్మాతతో శంకర్ విభేదాల కారణంగా కమల్ హాసన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇండియన్ 2 మధ్యలోనే ఆగిపోయింది. ఈ సమస్య కోర్టు వరకు వెళ్లింది. ఇండియన్ 2 అసంపూర్తిగా మిగిలిపోయినా శంకర్ ఇతర ప్రాజెక్టులపై పనిచేసుకునేందుకు మేజిస్ట్రేట్ శంకర్ కు అనుమతులు ఇచ్చారు.
ఈ అంశంపై కమల్ చాలా కాలం పాటు నోరు మెదపలేదు. చివరగా అతను ఇటీవల ఈ వివాదంపై ఓపెనయ్యారు. ఇండియన్ 2 షూటింగ్ 60 శాతం పూర్తయిందని చెప్పారు. సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. కమల్ సెట్స్ పై ఉన్న `విక్రమ్` చిత్రీకరణ తర్వాత ఇండియన్ 2 (భారతీయుడు 2) షూట్ తిరిగి ప్రారంభమవుతుందని అన్నారు. దీంతో విక్రమ్ చిత్రీకరణ ముగించిన తర్వాత కమల్ ఇండియన్ 2 సెట్స్ లో చేరతారని భావిస్తున్నారు. మరో వైపు, శంకర్ ఇండియన్ 2 పనులను పునః ప్రారంభించే ముందు రామ్ చరణ్ తో తన సినిమాని పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఇండియన్ 2 లో కాజల్ అగర్వాల్- సిద్ధార్థ్ - రకుల్ ప్రీత్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
అయితే ఈలోగానే శంకర్ తెరకెక్కించే తదుపరి చిత్రంపైనా వివాదం ముదరడం తాజాగా మరోసాచి చర్చనీయాంశమైంది. భారతీయుడు 2 సమస్య సద్ధుమణగక ముందే.. అన్నియన్ (అపరిచితుడు) రీమేక్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. త్వరలో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో అన్నీయన్ రీమేక్ ను తెరకెక్కిస్తున్నట్టు శంకర్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ను కొంతకాలం క్రితమే ప్రకటించారు. అయితే ఒరిజినల్ వెర్షన్ నిర్మాత అస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రం రీమేక్ హక్కులను తన వద్ద ఉన్నాయని తన సమ్మతి లేకుండా రీమేక్ ని సడెన్ గా ప్రకటించారని పేర్కొన్నారు. రవిచంద్రన్ ఇప్పటికే శంకర్ పైనా హిందీ నిర్మాత జయంతిలాల్ గదాపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (SIFCC) కి ఫిర్యాదు చేశారు. అస్కార్ రవిచంద్రన్ ఇప్పుడు శంకర్ -జయంతిలాల్ గదాకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు ప్రకటించాడు. తనకు జయంతిలాల్ గదా నుంచి స్పందన అవసరమని రీమేక్ గురించి తాను చర్చించాల్సి ఉంటుందని చెప్పాడు. సమస్య పరిష్కారానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతోంది కాబట్టి తాను త్వరలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయిస్తానని రవిచంద్రన్ చెప్పారు. రవిచంద్రన్ అన్నీయన్ రీమేక్ రైట్స్ ను తాను మాత్రమే కలిగి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. తాజా ఫిర్యాదు నేపథ్యంలో ఆర్.సి 15 చిత్రీకరణకు ఏవైనా ఆటంకాలున్నాయా? అన్నది వేచి చూడాలి. ఇకపోతే అన్నియన్ రీమేక్ తో కానీ.. భారతీయుడు 2తో కానీ సంబంధం లేకుండా చరణ్ తో సినిమాని పూర్తి చేస్తానని దిల్ రాజుకు శంకర్ మాటిచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్.సి 15 స్టార్ కాస్టింగ్ ఎంపికలు ప్రీప్రొడక్షన్ వేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక బాలీవుడ్ హీరోతో పాటు.. మిల్కీ బ్యూటీ తమన్నా విలన్ గా నటిస్తారని కథనాలొచ్చాయి. కియరా అద్వాణీ చరణ్ సరసన నటిస్తోంది.