బాహుబలి రైటర్ తో శంకర్

Update: 2015-09-29 11:30 GMT
బాహుబలి సినిమాతో డైరెక్టర్ శంకర్‌ కు ఏ సంబంధం లేదు.  కానీ బాహుబలి విడుదలైన నాటి నుంచి శంకర్ పేరు తరచుగా ప్రస్తావనకు వస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి భారీతనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న శంకర్.. ‘రోబో’ సినిమాతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయాడు. అతడికి పోటీ ఇచ్చే మొనగాడు ఇండియాలో ఇంకెవడూ లేడని తీర్మానించేశారు అతడి అభిమానులు. కానీ మన రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో శంకర్‌ కే సవాలు విసిరాడు. రోబో సినిమాకు సీక్వెల్ తీయాలని శంకర్ అనుకున్నపుడు.. తొలి భాగాన్ని మించేలా రెండో పార్ట్ తీయడమే అతడి టార్గెట్.  కానీ ‘బాహుబలి’ విడుదల తర్వాత టార్గెట్ మారింది. శంకర్ కొత్త టార్గెట్లన్నీ ‘బాహుబలి’నే నిర్ణయించింది.

సినిమా తీయడం దగ్గర్నుంచి బిజినెస్ - కలెక్షన్లు.. ఇలా ప్రతి విషయంలోనూ బాహుబలిని అధిగమించడమే శంకర్ టార్గెట్  ఇప్పుడు. ఇలాంటి తరుణంలో శంకర్ ‘బాహుబలి’కి పని చేసిన టెక్నీషియన్ల సాయం తీసుకుంటుండటం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే బాహుబలికి అద్భుతమైన ఎఫెక్ట్స్ సమకూర్చిన వీఎఫ్ ఎక్స్ నిపుణుడు శ్రీనివాస్ మోహన్ ‘రోబో-2’కు పనిచేయబోతున్నాడు. ఐతే శ్రీనివాస్ ఈ స్థాయికి రావడానికి కారకుడు శంకరే. ఇంతకుముందే శ్రీనివాస్ ‘రోబో’కు పని చేశాడు కాబట్టి అదేమీ ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. ఐతే బాహుబలి తమిళ వెర్షన్ కు మాటలు, పాటలు రాసి గొప్ప పేరు తెచ్చుకున్న మదన్ కార్కీని శంకర్ తన టీంలోకి తీసుకోవడమే ఆసక్తికరం. మదన్ ఇంతకుముందు కొంచెం చిన్న సినిమాలకే పని చేశాడు. ఇది అతడికి భారీ అవకాశమే. ఇప్పటికే జయమోహన్ తో కలిసి స్క్రిప్టు పూర్తి చేశాడు శంకర్. ఇప్పుడు మదన్ తో కలిసి ఇంకాస్త మెరుగులు దిద్ది, మాటలు జత చేయబోతున్నాడు
Tags:    

Similar News