#BIGGBOSS5TELUGU : షన్ను సిరిలు మరీ ఓవర్‌ అవుతున్నారు

Update: 2021-10-05 16:30 GMT
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. నాలుగు వారాల్లో ఏ ఒక్క వారం కూడా షణ్ముఖ్‌ నామినేట్ అవ్వలేదు. కాని అయిద వారంలో రహస్య నామినేషన్ కారణంగా ఏకంగా ఎనిమిది మంది ఆయన్ను నామినేట్‌ చేయడం జరిగింది. ఈ పరిస్థితి ఆయన్ను షాక్ కు గురి చేసింది. ఇంట్లో ఉన్న అబ్బాయిల్లో జెస్సీ తప్ప అందరు కూడా షణ్నును నామినేట్ చేయడం జరిగింది. ఇంత మంది నామినేట్‌ చేసిన షన్ను ఆశ్చర్య పోవడంతో పాటు ఇకపై నా ఆట చూస్తారు అంటూ డైలాగ్ లు పలికాడు. అంతే కాకుండా సిరితో దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా మొదట్లో చెప్పిన షన్ను ఆమెకు మరీ దగ్గర అవుతున్నాడు. ఆమె స్నేహంలో షన్ను తప్పుదారి పడతాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనాలు ఇద్దరి స్నేహంను మొదట్లో క్యూట్‌ అనుకున్నా కూడా ఇప్పుడు మాత్రం విసిగి పోతున్నారు.

వీరిద్దరికి తోడుగా జెస్సీ ఎప్పుడు ఉంటూనే ఉన్నాడు. అలా ఈ ముగ్గురు కలిసి ఎప్పుడు ఉంటున్నారు. అలాంటి సమయంలో జెస్సీ కిచన్ లో ఒక పని చెప్తే చేయను అనడంతో కెప్టెన్‌ శ్రీరామ్‌ నీ పని నువ్వు చేసుకో.. నీ వంట నీవు వండుకో అంటూ వ్యాఖ్యలు చేశాడు. దాంతో సీరియస్ అయిన జెస్సీ కోపంతో షన్ను మరియు సిరిల వద్దకు వెళ్లాడు. అక్కడ వారు ఫైర్ అయ్యారు. జెస్సీని అలా ఎలా అంటారు అంటూ షన్ను స్టాండ్‌ తీసుకున్నారు. ఆ సమయంలో శ్రీరామ్‌ మద్యలో వచ్చి ఈ విషయంలో మాట్లాడవద్దు అంటూ విజ్ఞప్తి చేశాడు. అయినా కూడా నాకు ఖచ్చితంగా మాట్లాడే రైట్‌ ఉంది.. అయినా ఎలా జెస్సీకి ఫుడ్‌ పెట్టను అంటావు అంటూ ప్రశ్నించాడు.

జెస్సీని వెనకేసుకు వచ్చే ఉద్దేశ్యంలో షన్ను మరియు సిరిలు ఓవర్‌ యాక్షన్ చేశారు. ఇద్దరు కూడా కాస్త సీరియస్ గానే శ్రీరామ్‌ పై అరిచారు. ఆ సమయంలో నేను ఫుడ్‌ పెట్టను అనలేదు.. కాని నీ ఫుడ్‌ నువ్వు వండుకో అన్నాను అంటూ చెప్పాడు. దాంతో కాస్త కూల్‌ అయిన వారు తిరిగి జెస్సీతో ఫుడ్‌ పెట్టను అన్నాడు అన్నావు కదా అంటూ తమ తప్పు ను సరి దిద్దుకునేందుకు జెస్సీకి క్లాస్ పీకారు. మళ్లీ తినకుండా ఉంటామని ముగ్గురు పక్కకు వెళ్లి కూర్చున్నారు. యానీ మరియు లోబోలు వచ్చి రమ్మన్నా కూడా వినిపించుకోలేదు. చివరకు శ్రీరామ్ స్వయంగా వచ్చి జెస్సీకి తినిపించడంతో కథ సుఖాంతం అయ్యిందని అనుకున్నాం.. కాని మళ్లీ గొడవ తదుపరి ఎపిసోడ్ లో జరుగబోతుంది. మొత్తం ఎపిసోడ్‌ లో షన్ను మరియు సిరిల అతి ప్రవర్తన విమర్శలకు తావిస్తోంది.




Tags:    

Similar News