యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్''. రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం.. టీజర్ విడుదలైనప్పటి నుంచి ఏదొక రకంగా వార్తల్లో నిలుస్తోంది.
'ఆదిపురుష్' టీజర్ లో వీఎఫ్ఎక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయని.. కార్టూన్ సినిమాని తలపిస్తున్నాయని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అయితే ఈ మైథలాజికల్ డ్రామా అద్భుతంగా ఉంటుందని.. ఓం రౌత్ అందరూ ఆశ్చర్యపోయే సినిమాను అందించనున్నారని బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ పేర్కొన్నారు.
ప్రభాస్ సినిమాలకు హిందీలో శరద్ కేల్కర్ డబ్బింగ్ చెబుతుంటారు. 'బాహుబలి' ప్రాంఛైజీలో వచ్చిన రెండు సినిమాలకూ అతనే వాయిస్ అందించాడు. ఇప్పుడు 'ఆదిపురుష్' చిత్రంలోనూ ప్రభాస్ పాత్రకు శరద్ డబ్బింగ్ చెప్పనున్నారు. అయితే ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓం రౌత్ అద్భుతమైన దర్శకుడని.. 'ఆదిపురుష్' సినిమా కూడా అద్భుతంగా ఉండనుందని శరద్ కేల్కర్ పేర్కొన్నారు. ఇంకా పూర్తిగా డబ్బింగ్ చెప్పలేదని.. కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ చూశానని.. అవి ఎంతో బాగా వచ్చాయని నటుడు తెలిపారు.
సినిమాను ఓం రౌత్ చూసే దృష్టి కోణం వేరుగా ఉంటుందని.. సినిమాలపై ఆయనకు ఎంతో జ్ఞానం ఉందని కేల్కర్ అన్నారు. ఈ రోజుల్లో మనకు ఇలాంటి దర్శకుడి అవసరం ఎంతో ఉందని అభిప్రాయ పడ్డారు. ఇంతకు ముందు ఎవరూ 'ఆదిపురుష్' లాంటి ప్రయత్నం చేయలేదని చెప్పారు.
టీజర్ చూసి విమర్శించే వారికి చెప్పేది ఒక్కటే.. ఓం రౌత్ ను నమ్మండి. ఆయన త్వరలోనే మీరు ఆశ్చర్యపోయే సినిమాను అందిస్తారు. 'ఆదిపురుష్' మూవీ అద్భుత విజయం సాధిస్తుందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను అని శరద్ కేల్కర్ ధీమా వ్యక్తం చేశారు.
'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శరత్ కేల్కర్.. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన 'తన్హాజీ' చిత్రంలో ఛత్రపతి శివాజీ పాత్రలో నటించారు. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పడంతో పాటుగా.. 'గద్దలకొండ గణేష్' హిందీ డబ్బింగ్ వెర్షన్ లో వరుణ్ తేజ్ కు వాయిస్ అందించారు. తాజాగా 'హర హర మహాదేవ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక 'ఆదిపురుష్' సినిమా విషయానికొస్తే.. ఇందులో రాఘవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. జానకిగా కృతి సనన్ - లంకేశ్ గా సైఫ్ ఆలీఖాన్ కనిపించనున్నారు. టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో జనవరి 12న 3డీ మరియు ఐమాక్స్ ఫార్మాట్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.