అదిరింది సంగతి అంతేనా?

Update: 2017-10-23 17:08 GMT

కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో మార్కెట్ ఉన్న హీరో విజయ్. అయితే టాలీవుడ్ లో మాత్రం అతని మార్కెట్ ఏ మాత్రం పెరగడం లేదు. అక్కడ విజయ్ కంటే తక్కువ స్థాయిలో ఉన్న హీరోల సినిమాలు టాలీవుడ్ లో మంచి వసూళ్లను రాబడతాయి. అయితే ఈ సారి ఎలాగైనా టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టాలని భారీ బడ్జెట్ లో తెరకెక్కిన మెర్సల్ సినిమాను తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అదిరింది అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశాడు.

కానీ తెలుగు హక్కులను పొందిన నిర్మాతకు మెర్సల్ చుక్కలు చూపిస్తోంది. భారీ ఖర్చు తో అనువాదపు హక్కులను అందుకున్న పవన్ కళ్యాణ్‌ స్నేహితుడు శరత్ మరార్ కు సినిమా విడుదల కాకముందే నష్టాలను చూపిస్తోంది. ఇప్పటికే దీపావళి సందర్భంగా తమిళ్ వెర్షన్ మెర్సల్ రిలీజ్ అయ్యింది. కాని తెలుగులో సెన్సార్ సమస్యల వల్ల లేట్ అవుతోందని రెండు రోజుల్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ వారం పూర్తవుతున్నా ఇంకా అదిరింది గురించి ఎటువంటి సమాచారం లేదు.

చిత్ర నిర్మాత థియేటర్స్ ని బుక్ కూడా చేసుకున్నాడు. అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడు. సినిమాలో  జిఎస్ట్ గురించి కొన్ని కామెంట్స్ ఉన్నాయని ఇప్పటికే బిజెపి నేతలు కామెంట్స్ చేస్తున్నారు. బహుశా అందుకే తెలుగు సెన్సార్ పర్మిషన్ ఇవ్వడం లేదని కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఇక సినిమాకి పైరేసి దెబ్బ కూడా పడింది. కొన్ని రివ్యూస్ కూడా చాలా యావరేజ్గా ఉన్నాయి. మరి అదిరింది రిలీజ్ అయితే.. చిత్రం ఎంత వరకు వసూళ్లను సాధిస్తుందో చూడాలి.
Tags:    

Similar News