అక్కడ సెన్సార్ వలనే అదురుతోంది

Update: 2017-10-25 06:09 GMT
నిర్మాతలకు సినిమాలతో వచ్చే తలనొప్పులు అన్ని ఇన్ని కావు. సినిమా మొదలైనప్పటి నుండి షూటింగ్ ఎండ్ అయ్యే వరకు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అనువాదపు చిత్రాల హక్కులను కొనుక్కున్నప్పుడు మాత్రం అంతగా ఇబ్బందులు ఉండవు. కానీ నిర్మాత శరత్ మరార్ మాత్రం ఇప్పుడు అనువాదపు చిత్రాన్ని కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - మెర్సల్ సినిమా ఈ నెల 18న విడుదలైన సంగతి తెలిసిందే అయితే ఆ సినిమా తెలుగులో కూడా అదే రోజు రిలీజ్ అవ్వాలి. అదిరింది అని టైటిల్ ఫిక్స్ చేసిన ఆ సినిమా ఆ రోజు కాదు కాదా ఇప్పటివరకు రిలీజ్ కు నోచుకోలేదు. తమిళ్ లో ఇప్పటికే సినిమా మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. విజయ్ కెరీర్ లో మరో భారీ కలెక్షన్స్ నమోదు చేసే చిత్రంగా దూసుకుపోతోంది. అయితే హైదరాబాద్ లో అసలు నిర్మాతలు తెలుగు సెన్సార్ ని పూర్తి చేయడంలో కాస్త అశ్రద్ధ వహించినట్లు తెలుస్తోంది. అసలైతే తమిళ్ వెర్షన్ కి సెన్సార్ పనులను నిర్వహించినప్పుడే తెలుగు సెన్సార్ పనులను కూడా పూర్తీ చెయ్యాలి. అయితే ఆ పనులను హైదరాబాద్ లో పూర్తి చేయకుండా మనోళ్లు తమిళనాడులో చేసేద్దాం అని అక్కడే సెన్సార్ కు ఎప్లయ్ చేశారట. దానితో అక్కడ ఇప్పుడు సెన్సార్ కాకపోవడంతో రిలీజ్ ఇబ్బందులు తలెత్తాయ్ అని తెలుస్తోంది.

శరత్ మరార్ సినిమా హక్కులను కొన్నప్పుడే ప్రమోషన్స్ కి 3 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. అంతే కాకుండా సినిమా థియేటర్స్ ని కూడా బుక్ చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో అన్ని తారుమారయ్యాయి. ఫైనల్ గా ఈ శుక్రవారం సినిమాను ఎలాగైనా రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయినట్లు శరత్ మరార్ చెబుతున్నారు. మరి ఎంతవరకు ఈ సినిమా తెలుగులో సక్సెస్ అవుతుందో చూడాలి.     
Tags:    

Similar News