హిమచల్ బ్యూటీ రుహానీ శర్మ టాలీవుడ్ లో బిజీ నాయికగా మారుతోంది. పంజాబీ చిత్రాల్లో నటించి బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించిన ఈ బ్యూటీ చివరికి తెలుగు చలనచిత్ర సీమలో ఊహించని జాక్ పాట్ కొట్టింది. చి.ల.సౌ చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశించింది.
సుశాంత్ సరసన నాయికగా తనదైన ఆహార్యంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత `డర్టీ హరి` లాంటి బోల్డ్ మూవీతో మరింత పాపులారిటీ పెంచుకుంది. అగ్రనిర్మాత కం దర్శకుడు ఎం.ఎస్.రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
దాసు అలియాస్ విశ్వక్ సరసన `హిట్ - ది ఫస్ట్ కేస్` చిత్రంలోనూ ఆసక్తికర పాత్రలో నటించింది. తెలుగు తమిళంలోనూ బిజీ నాయికగా అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రుహానీ స్పీడ్ పెంచింది.
తాజాగా మరో హాట్ ఫోటోని రుహానీ షేర్ చేయగా వైరల్ గా మారింది. రుహానీ మునుపటితో పోలిస్తే గ్లామరస్ లుక్ తో కనిపిస్తోంది ఈ ఫోటోగ్రాఫ్ లో. బ్లాక్ అండ్ రెడ్ చెక్స్ ఫ్యాంట్ లో కనిపించిన రుహానీ క్రీమ్ కలర్ బ్రాలెట్ తో గుబులు రేపు లుక్ లో కనిపించింది. దీనికి ఊల్ తో డిజైన్ చేసిన షోల్డర్ కోట్ ని జోడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రుహానీ టూ హాట్ గా కనిపిస్తోందంటూ అభిమానులు దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు. పక్కింటి అమ్మాయిగా నటిస్తూనే గ్లామరస్ పాత్రలకు సరిపోయే లుక్ రుహానీ సొంతం. కానీ రుహానీ తన ఇమేజ్ కి దూరంగా గ్లామర్ డాళ్ రోల్స్ ని కోరుకుంటోందని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రుహాని తదుపరి నటుడు నాని సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న `మీట్ క్యూట్` అనే సిరీస్ లో కనిపించనుంది. యోడ్లీ ఫిల్మ్స్ నిర్మిస్తున్న `ఆగ్రా` అనే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తెలుగు సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ లో ను తన అదృష్టం పరీక్షించుకుంటోంది.