ఫోటో స్టొరీ: చిరుత సిస్టర్స్ జిమ్ము సెల్ఫీ

Update: 2019-03-05 07:18 GMT
నేహ శర్మ పేరు తెలియని రామ్ చరణ్ ఫ్యాన్ దాదాపుగా ఉండరు. ఎందుకంటే చరణ్ డెబ్యూ ఫిలిం 'చిరుత' లో హీరోయిన్ గా నటించిన నేహ పాత్రను.. నేహ పొగరును ఎవరైనా ఎలా మరచిపోగలరు? మొదటి సినిమాతో మంచి పేరే తెచ్చుకున్నా ఎందుకో నేహకు టాలీవుడ్ లో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో ముంబైకి తిరుగుటపా కట్టింది.  అప్పటి నుంచి బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ భామ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్. రెగ్యులర్ గా హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులను సంతోషపెడుతూ ఉంటుంది.

ఈ భామకు ఐషా శర్మ అనే మరో హాటు చెల్లి ఉంది. నేహ రేంజ్ లో ఈ చెల్లి పాపులర్ కాదు కానీ ఈ బ్యూటీ కూడా తక్కువేమీ తినలేదు.  అక్కకు ఆరు మిలియన్ల ఫాలోయర్లు ఉంటే ఈ భామకు దాదాపు వన్ మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.  అక్కలాగానే ఈమెకూడా ఫిట్నెస్ ఫ్రీక్.  జిమ్ముకు వెళ్ళకుండా కసరత్తులు చేయకుండా రోజు గడవదు.  ఈమధ్య నేహ.. ఐషా ఇద్దరూ కలిసి బిగుతైన జిమ్ము దుస్తులు ధరించి ఎడాపెడా ఎక్సర్ సైజులు చేసి పారేశారు. అంతటితో ఆగకుండా సదరు వ్యాయామశాలలోనే పెద్ద అద్దం ముందు నిలబడి ఒక సెల్ఫీ తీసుకున్నారు.  ఆ ఫోటోను ఇద్దరూ తమ తమ ఇన్స్టా ఖాతాలలో పోస్ట్ చేశారు.  దీంతో జనాలు పండగ అన్న సంగతి మర్చిపోయి మరీ ఈ భామలను పొగుడుతూ ఫుల్ గా కామెంట్లు పెట్టారు.

ఇంతకీ ఈ నేహ శర్మ ఈ ఫోటోకు ఇచ్చిన క్యాప్షన్ ఏంటో తెలుసా? 'సోమవారం కసరత్తులు బాగా చేశాం'.  చాలామందికి సోమవారం అంటే చాలు ఎక్కడలేని నీరసం.. నిస్సత్తువ.. జ్వరాలు.. కడుపు నొప్పి.. కాలు నొప్పి.. నడుము నొప్పి.. అన్నీ వస్తాయి. కానీ ఈ శర్మ సిస్టర్లకు ఆదివారం లేదు.. సోమవారం లేదు ఎప్పుడు కసరత్తులు చేయడమే.  అయినా మన టాలీవుడ్ నిర్మాతలు ఈ సిస్టర్లపై దృష్టి సారించడంలేదెందుకనో..!
Tags:    

Similar News