దేశంలోనే టాప్-1 ఎర్నర్ ఎవరు? డబ్బులో, పరపతిలో నెం.1 స్టార్ ఎవరు? దీనికి సమాధానం వచ్చేసింది. ప్రఖ్యాత ఫోర్బ్స్ సంస్థ చేసిన అధ్యయనంలో బోలెడన్ని ఆసక్తికర సంగతులు బైటికొచ్చాయి. భారతదేశంలోనే నంబర్ -1 స్లార్‌గా షారూక్‌ఖాన్ పేరుని డిక్లేర్ చేశారు. షారూక్ సంపాదనలో నెం.1, పేరు ప్రఖ్యాతుల్లో అమితాబ్ నెం.1.
ఏకంగా 257.5 కోట్ల వార్షికాదాయంతో షారూక్ టాప్-1 ఎర్నర్‌గా క్రెడిట్‌ని అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో 202.7 కోట్ల వార్షికాదాయంతో సల్మాన్‌ఖాన్ రెండో స్థానాన్ని అందుకున్నాడు. గత ఏడాది సల్మాన్ నెం.1 స్టార్ అయితే షారూక్ మూడో స్థానంలో నిలిచాడు. కానీ ఈ ఏడాది సీన్ మొత్తం మారింది. వరుస హిట్లు.. చేతినిండా యాడ్లు.. సినిమా అవార్డుల ఫంక్షన్లను హోస్ట్ చేయడం.. వగైరా విషయాలన్నింటిలో షారూఖ్ ముందున్నాడు. దానితో ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. పైగా షారూఖ్-కాజోల్ తిరిగి దిల్ వాలే సినిమా కోసం జంటగా నటించడంతో.. మనోడిపై హైప్ కూడా బాగా పెరిగింది. కట్ చేస్తే.. ఫోర్బ్స్ జాబితా తాలూకు శ్రీమంతుడు ఆయనే.
ఇకపోతే.. దేశంలో 100 మంది సెలబ్రిటీల వార్షికాదాయం 2,819 కోట్లు. ఈ పేర్ల జాబితాలో మహేష్, అల్లు అర్జున్, కాజల్, శ్రుతిహాసన్, ప్రభాస్, రవితేజ, రాజమౌళి, పూరి జగన్నాథ్ పేర్లు ఉన్నాయి. 51 కోట్ల ఆదాయంతో మహేష్ పేరు జాబితాలో 36వ స్థానంలో ఉంది. 37.5 కోట్లతో అల్లు అర్జున్ పేరు 42వ స్థానంలో నిలిచింది. 10 కోట్ల ఆదాయంతో కాజల్ 58వ స్థానంలో, 8 కోట్ల ఆదాయంతో శ్రుతిహాసన్ 61వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో మన స్టార్లు, డైరెక్టర్లు ఉన్నారు. అయితే వీళ్ల ర్యాంకింగులు కేవలం సంపాదన ప్రామాణికంగానే కాకుండా పాపులారిటీ ప్రామాణికంగా నిర్ణయించారు. అదీ మ్యాటరు.