బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఆరోపణలు అప్పట్లో ఎంతటి సంచలనమైందో తెలిసిందే.ముంబై క్రూయిజ్ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు దాడి ..14 మంది అరెస్ట్ లో ఆర్యన్ ఒకరు కావడం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారామే రేపింది. ఆర్యన్ కొన్ని రోజుల పాటు రిమాండ్ లో ఉండటం..కోర్టు..జైలు అంటూ విచారణ ఎదుర్కోవడం బాద్ షాని కోలుకోలేకుండా చేసింది.
సోషల్ మీడియా వేదికగా విమర్శలు..వ్యతిరేకత. కుమారుడిని పెంచే విధానం ఇదేనా? అంటూ సూటిపోటీ మాటలు. ఇలా ఒకటేంటి? ఓ సామాన్యుడు పై కేసు పడితే ఎంత క్షోభకి గురవుతారో అంతటి బాధని షారుక్ కుటుంబం భరించింది. చివరికి ఎన్ సీబీ విచారణలో సరైన ఆధారాలు లేవంటూ కోర్టు ఆర్యన్ పై క్లీన్ చీట్ ఇచ్చింది.
ప్రస్తుతం షారుక్ కుటుంబం ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మనసుకు తగిలిన గాయలకు నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు లోతైన విచారణ సాగుతన్నా..కోర్టు క్లీన్ చీట్..నిర్దోషి అన్న ధీమా ఆర్యన్ మాటల్లో కనిపిస్తుంది. తాజాగా ఈ ఉదంతాన్ని గుర్తు చేసుకుని షారుక్ ఎన్ సీబీ అధికారి ముందు కన్నీటి పర్యంతం అయ్యారుట.
`సమాజాన్ని నాశనం చేసేందుకు బయల్దేరినన ఒక రకమైన నేరస్థులుగా.. రాక్షసులుగా మమ్మల్ని అందరూ చిత్రీకరించారు. చివరికి ఇంటి గడపదాటి బయటకు వెళ్లాలంటేనే భయమేసంతంగా ఆ ఉదంతం ప్రభావితం చేసిందని షారుక్ ఆవేదన చెందినట్లు ఎన్ సీబీ అధికారి సంజయ్ సింగ్ చెప్పినట్లు ఓ జాతీయ వార్త సంస్థ ద్వారా బయటకు వచ్చింది.
దీంతో షారుక్ ఆవేదన ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. షారుక్ కన్నీటి పర్యంతం తో ఆ కుటుంబం ఎంతగా మనస్తాపానికి గురైందన్నది తేట తెల్లమవుతుంది. బాలీవుడ్ నుంచి డ్రగ్స్ కేసులో దొరికిన సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. అరెస్టై అయి జైలుకెళ్లొచ్చిన వారు..ఇంకా ఆకేసుకు సంబంధించి విచారణ ఎదుర్కుంటున్న వారు చాలా మందే ఉన్నారు.
కానీ షారుక్ తరహాలో ఇంతలా మనస్తాపానికి గురైంది లేదు. దీన్ని బట్టి ఈ ఘటన విషయంలో షారుక్ కుటుంబం ఎంతగా క్షోభకి గురైందో అర్ధమవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్స్ కేసుని మళ్లీ ఎన్ సీబీ తిరగ తొడుతోన్న సంగతి తెలిసిందే.
కేసులో సరైన సాక్షాలు లేవంటూ కొంత మంది సెలబ్రిటీలపై క్లీన్ చీట్ వచ్చినా మళ్లీ అధికారులు విచారణకు రంగం సిద్దం చేస్తున్నారు. సెబ్రిటీల ఫోన్లని సేకరించి వాటి ద్వారా కీలక సమాచారం రాబట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మళ్లీ ఏ క్షణమైనా ఎన్ సీబీ విచారణకు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవ్వాల్సి ఉంటుందని ప్రచారం సాగుతోంది.