ర‌ణ‌బీర్ త‌ర్వాత కింగ్ ఖాన్ ఏసేశాడు!

Update: 2022-12-18 03:33 GMT
బాలీవుడ్ స్టార్ హీరోల టోన్ మారింది. ముఖ్యంగా వారి ఆలోచ‌నా ధృక్ప‌థం అనూహ్యంగా విస్త్ర‌తిని పెంచుకుంది. ఇటీవ‌లి కాలంలో ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌పై అనాలోచిత పొగ‌డ్త‌లు పెరిగాయి. ఇక్క‌డి వారిని పొగ‌డ‌కపోతే గ‌ల్లా పెట్టె నిండ‌ద‌ని భ‌యం ప‌ట్టుకుంది. ఖాన్ లు క‌పూర్ లు రోష‌న్ లు ఎవ‌రైనా ఇప్పుడు భ‌య‌ప‌డుతున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అంద‌క‌పోతే కేవ‌లం ద‌క్షిణాది హీరోలు మాత్ర‌మే పాన్ ఇండియా హీరోలుగా వెలిగిపోతారు. ఇది స‌హించ‌లేనిది. ఒక‌ప్పుడు భార‌త‌దేశ సినిమా అంటే హిందీ ప‌రిశ్రమ అని చెప్పుకున్న‌వాళ్లంద‌రికీ ఇది నామోషీ.

అందుక‌ని ఇప్పుడు బాలీవుడ్ లో టోన్ మారింది. ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌ను పొగ‌డాల‌సిన స‌న్నివేశం క‌నిపిస్తోంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ తెలుగు ఆడియెన్ ని .. త‌మిళ ఆడియెన్ (టోట‌ల్ అర‌వ బెల్ట్) ని పెద్ద‌గా ప‌ట్టించుకోని హీరోలంతా ఇడ్లీ సాంబార్! అంటూ వెకిలిగా మాట్లాడిన‌వారంతా ఇప్పుడు టోన్ మార్చారు. అస‌లు ద‌క్షిణాది ప్రేక్ష‌కులు లేనిదే తాము లేమ‌ని అంటున్నారు. బ‌త‌క‌లేమ‌ని కూడా అనేట్టున్నారు.

చూస్తుండ‌గానే ర‌ణ‌బీర్ క‌పూర్.. అక్ష‌య్ కుమార్.. స‌ల్మాన్ ఖాన్.. వ‌రుణ్ ధావ‌న్ ఇలా అంద‌రూ ద‌క్షిణాది మార్కెట్ పై గ్రిప్ పెంచుకోవాల‌ని క‌ల‌లు గంటున్న వైనం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ర‌ణ‌బీర్ న‌టించిన బ్ర‌హ్మాస్త్ర‌- వ‌రుణ్ ధావ‌న్ న‌టించిన తోడేలు (బేధియా) పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల‌య్యాయి. ఇరువురు హీరోలు సౌత్ లో టూటైర్ సిటీల‌కు ప్ర‌చారానికి విచ్చేసి ఇక్క‌డి ఆడియెన్ ని పొగిడేశారు. ఇక‌పై హిందీ అగ్ర హీరోలంతా ఒక‌రొక‌రుగా క్యూ క‌ట్ట‌నున్నారు. ఈసారి కేవ‌లం మెట్రో న‌గ‌రాల‌కే ప‌రిమితం అయిపోకుండా తెలుగు రాష్ట్రాల్లోని టూటైర్ సిటీల‌కు కూడా వ‌చ్చి ప్ర‌చారం చేసేందుకు వెన‌కాడ‌ర‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది.

ఇప్పుడు కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ వంతు. అత‌డు వరుస ఫ్లాప్‌ల తర్వాత ఐదేళ్ల‌ విరామం తీసుకున్నాడు. గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు తెలివైన ప్ర‌ణాళిక‌ల‌తో భారీ విజ‌న్ తో దూసుకొస్తున్నాడు. ఇటీవ‌ల వ‌రుస సినిమాల‌తో ఘనమైన లైనప్ ను కలిగి ఉన్నాడు. ఖాన్ న‌టించిన ప‌ఠాన్ 25 జనవరి 2023న విడుద‌ల కానుంది. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.

తాజాగా ఖాన్ ట్విట్టర్ లో అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. అత‌డు త‌న ప్రేమ ప‌రిధిని ద‌క్షిణాదికి విస్త‌రించాడు. తెలుగు ప్రేక్షకుల గురించి మాట్లాడమని ఒక ట్విట్ట‌రాటీ ప్ర‌శ్నించ‌గా.. ``అత్యంత వీడియో అక్షరాస్యులు .. ఉత్తేజకరమైన సినిమా వీక్షకులు`` అని షారుఖ్‌ పొగిడేశారు. అత‌డి ఉద్ధేశం సినిమా  టీవీ యూట్యూబ్ లేదా ఇంకేదైనా విజువ‌ల్స్ ని వీక్షించేందుకు ద‌క్షిణాదిన ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తార‌ని అనుకోవ‌చ్చు. ద‌క్షిణాది సినీప్రియులు గొప్ప‌వారు అని భావించ‌వ‌చ్చు.

మొత్తానికి కింగ్ ఖాన్ తెలుగు ఆడియెన్ తో పాటు అర‌వ‌తంబీల‌ను బాగా అర్థం చేసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే ఇప్పుడు త‌మిళ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ అట్లీతో ప‌ని చేస్తున్నాడు. చెన్న‌య్ ఎక్స్ ప్రెస్ మూవీ త‌ర్వాత మ‌ళ్లీ ఇటువైపు పూర్తిగా దృష్టి సారించాడు. ఈసారి నార్త్- సౌత్ బెల్ట్ ల‌ను క‌లుపుకుని పాన్ ఇండియా హిట్లు కొట్టాల‌ని పంతంతో క‌నిపిస్తున్నాడు. మొత్తానికి  బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ గొప్ప మాటలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఖాన్ న‌టించిన `పఠాన్` తెలుగులో కూడా భారీగా విడుదల కానుంది. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటించింది. యష్ రాజ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు. ప‌ఠాన్ నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. మరి ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు రాష్ట్రాలు స‌హా ద‌క్షిణాదిన ఏ రేంజులో ఆడుతుందో చూడాలి.
Tags:    

Similar News