ఓటీటీ (ఓవర్ ద టాప్ కంటెంట్) టెక్నాలజీని వరల్డ్ ని ఎలా ఏల్తుందో చెప్పాల్సిన పనిలేదు. కరోనా రాకతో ఓవర్ ద టాప్ కంటెంట్ అంటే ఏంటే? ఓ క్లారిటీ వచ్చింది. అప్పటివరకూ ఓ సెక్షన్ ఆడియన్స్ కి మాత్రమే పరమితమైన ఓటీటీ గురించి ఇప్పుడు ప్రతీ ఇంట పరిచయమే.
సినిమాలు..వెబ్ సిరీస్ లు..స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇలా ఆడియన్ ఆలోచనని మించిన కంటెంట్ ఇప్పుడు ఓటీటీ అందిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే మెగా నిర్మాత అల్లు అరవింద్ ముందే విషయాన్ని పసిగట్టి `ఆహా` అనే ఓటీటీని ప్రారంభించి సక్సెస్ అయ్యారు. దానికి అనుబంధంగా `ఆహా 2.0` ని కూడా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అరవింద్ తన ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ఇండియాలో ఫేమస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. భవిష్యత్ లో అన్ని భాషల్లో బిగ్ స్కేల్ లో లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఇంకా తెలుగులో చిన్నా చితకా ఓటీటీలు ఎన్నో ఉన్నాయి.
ఇటీవలే బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ కూడా ఓటీటీ వరల్డ్ లోకి అడుగు పెడుగు పెట్టిన సంగతి తెలిసిందే. యశ్ రాజ్ అధినేత ఆదిత్య చోప్రా 500 కోట్ల పెట్టుబడితో ఓటీటీ సంస్థని లాంచ్ చేసారు. అందులో కంటెంట్ కూడా అంతే యూనిక్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా తొలి వెబ్ సిరీస్ కే 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఇటీవలే అనుష్క శర్మ సైతం ఓ కార్పోరేట్ ఓటీటీ సంస్థతో 400 కోట్ల పెట్టుబడి తో ఒప్పందం చేసుకున్నారు. తాజాగ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా ఓటీటీ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఈ విషయాన్ని షారుక్ స్వయంగా రివీల్ చేసారు. `ఎస్ ఆర్ కె ప్లస్` అనే బ్రాండ్ టైటిల్ తో షారుక్ ఓటీటీ మార్కెట్ లోకి రాబోతుంది.
సంస్థ తాలుకా లోగోని కూడా షారుక్ ఆవిష్కరించారు. అతి త్వరలోనే షారుక్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ఓటీటీ కోసం షారుక్ ఎన్ని కోట్లు వెచ్చిస్తున్నారు? అన్న వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. ఈ విషయం బాలీవుడ్ సహా ఇతర ఇండస్ర్టీలో వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక షారుక్ సినిమాల విషయానికి వస్తే `పఠాన్` లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది. భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ కానుంది. అలాగే కోలవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. తమిళ్..హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ . బాలీవుడ్ సహా కోవుడ్ ఇతర భాషల నటుల్ని భాగం చేస్తున్నారు. ఈ కాంబినేషన్ ప్రకటనతోనే అంచనాలు మిన్నంటుతున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమై ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది.