షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్ద్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. సుమారు 4 ఏళ్ళ తర్వాత షారుక్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఓ వైపు నెగిటివ్ ప్రచారం నడుస్తున్నా కూడా ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్ తో రికార్డు సృష్టిస్తున్నారు. ఇప్పటికే మొదటి వారం రోజులకి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ముంబైలో చాలా థియేటర్స్ లో అయిపోయినట్లు తెలుస్తుంది.
యూఎస్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని అప్పుడే రాబట్టింది అని తెలుస్తుంది. ఈ అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా సుమారు 20 కోట్లకి పైగానే మొదటి రోజు కలెక్షన్స్ వచ్చాయనేది అంచనా. ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ సినిమా చూడటానికి ఇండియన్ వైజ్ గా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హై వోల్టేజ్ కంటెంట్ కావడంతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ పవర్ ఫుల్ గా ఉండటంతో ట్రైలర్ తోనే సినిమా భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
ఈ నేపధ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి రోజు 40 నుంచి 45 కోట్ల నెట్ రాబట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే రెండో రోజు కూడా 50 నుంచి 52 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అలాగే రెండు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ ని పఠాన్ మూవీ చేరుకుంటుంది అని ట్రెండ్ పండితులు విశ్లేషిస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే మొదటి ఐదు రోజుల్లో 180 నుంచి 200 కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ బిటౌన్ లో వినిపిస్తుంది. కచ్చితంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పఠాన్ తో మంచి రోజులు వస్తాయనే అందరూ భావిస్తున్నారు. రీసెంట్ గా ప్రధాని మోడీ సైతం సినిమాలని అడ్డుకునే ప్రయత్నం రాజకీయ నాయకులు గాని, పార్టీ కార్యకర్తలు గాని చేయవద్దని పిలుపునిచ్చారు.
ఆ తరువాత పఠాన్ కి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పూర్తిగా మారినట్లు కనిపిస్తుంది. ఈ నేపధ్యంలోనే పఠాన్ సినిమాతో మళ్ళీ బాలీవుడ్ బ్యాక్ టూ ఫామ్ అని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో దీపికా పదుకునే, జాన్ అబ్రహం లాంటి స్టార్స్ నటిస్తూ ఉండగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. మరి ట్రెండ్ పండితుల అంచనాలు అందుకునే విధంగా పఠాన్ మూవీ కలెక్షన్స్ ఉంటాయా లేదా అనేది తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాలి.