యూత్ లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ కలిగిన శర్వానంద్ బయటికి చెప్పడు కాని ఆర్గానికి ఫార్మింగ్ అంటే తనకు చాలా ఆసక్తి. బాగా సన్నిహితంగా ఉండేవాళ్లకు ఈ సంగతి తెలుసు. దీని గురించి అవగాహనతోనే స్వంతంగా సాగు చేసి మరీ పండించిన మామిడి పళ్ళను మీడియా మిత్రులకు సెలబ్రిటీ ఫ్రెండ్స్ కు పంవడంతో ఇవాళ వాటిని అందుకున్న అందరికి స్వీట్ షాక్ ఇచ్చింది. స్పెషల్ గా ప్యాక్ చేసిన బాక్స్ లో బెస్ట్ విషెస్ ఫ్రం శర్వానంద్ అంటూ లేబుల్ వేసి మరీ వాటిని పంపాడు శర్వా.
ఎలాంటి కృత్రిమ పద్దతులు పాటించకుండా ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో ప్రధమ ప్రాధాన్యత తీసుకునే ఆర్గానిక్ ఫార్మింగ్ లో పండిన పళ్ళను అందుకున్న వాళ్ళ నోళ్ళు తినకుండా ఉంటాయా. మనసులు శర్వాకు థాంక్స్ చెప్పకుండా ఉంటాయా. ప్రస్తుతం అదే జరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ ఇదే తరహాలో పళ్ళను ఫ్రెండ్స్ కు పంపేవాడు. అలా అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు వాటిని ఫోటోల రూపంలో షేర్ చేస్తే అవి బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం జనసేన కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ ఆ కారణంగానే దాని మీద ఫోకస్ పెట్టలేదు కాని బాధ్యతలు ఇతరులకు అప్పగించాడు.
ఇప్పుడు శర్వా అదే తరహాలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇలా పళ్ళను పంపడం మంచి సంప్రదాయం అని చెప్పొచ్చు. ఏదో అకేషన్ ఉంటేనో లేదా ఏదైనా సాధిస్తేనో ఇచ్చి పుచ్చుకోవడం కాకుండా ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటి పద్దతులకు ప్రచారం కల్పిస్తూనే శ్రేయోభిలాషులకు తానెంత ప్రాధాన్యత ఇస్తానో శర్వా ఇలాంటి చర్యల ద్వారా రుజువు చేస్తున్నాడు. ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత శర్వానంద్ కొత్త సినిమా రణరంగం ఆగస్ట్ 3 విడుదలకు రెడీ అవుతోంది