నిజాలు ఒప్పుకోవడానికి సాధారణంగా ఎవరికీ మనసు అంగీకరించదు. అది మానవ నైజం. సహజం కూడా. హిపోక్రసీ రాజ్యమేలే సినిమా పరిశ్రమలో ఇది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది . ముఖ్యంగా తమ సినిమా ఎలా ఆడుతున్నా ఎంత నెగటివ్ టాక్ వచ్చినా క్రిటిక్స్ రివ్యూలలో ఎన్ని విషయాలు చెప్పినా వాటిని ఒప్పుకోకుండా తాము తీసిందే కళాఖండం అని డంకా భజాయించే వాళ్ళకు కొదవలేదు. గత ఏడాది ఓ దర్శకుడు ఇదే విషయంలో స్టేజి మీదే టెంపర్ కోల్పోయి ఏదేదో అరిచేసాడు. కట్ చేస్తే సినిమా ఫ్రీగా చూసే యుట్యూబ్ లో హిట్ అయ్యింది ధియేటర్లలో ఫ్లాప్ అయ్యింది.
ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కాని శర్వానంద్ మాత్రం ఈ విషయంలో తాను వేరే అని నిజాయితి ఉన్నవాడినని ప్రూవ్ చేసుకున్నాడు. మహానుభావుడు తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని చేసిన పడి పడి లేచే మనసు పరాజయం పాలైన విషయాన్ని శర్వానంద్ నిజాయితిగా ఒప్పుకున్నాడు. చాలా గొప్ప సినిమా తీసామని అనుకున్నానని అయితే తన కెరీర్ లో ఎంత స్పెషల్ గా నిలిచినా అందరిని మెప్పించలేకపోయినందుకు క్షమించమని మరోసారి ఇవి రిపీట్ కాకుండా చూసుకుంటానని చెప్పాడు.
అంతే కాదు క్రిటిక్స్ వెలిబుచ్చిన అభిప్రాయాలు చదివానని తప్పు పట్టడానికి ఏమి లేదని వాళ్ళను గౌరవిస్తూ సరిదిద్దుకునే ప్రయత్నం వచ్చే సినిమా నుంచే చేస్తానని చెప్పేసాడు. వీలైతే కాస్త పుష్ చేయమని స్వచ్చంగా మీడియాను రిక్వెస్ట్ చేసిన శర్వా సక్సెస్ మీట్ స్టేజి మీదే ఇలా మాట్లాడి సినిమా మనసు ఏమో కాని నిజ జీవితంలో మనసులు మాత్రం గెలిచేసుకున్నాడు. రివ్యూలు రేటింగులు అంటేనే అంతెత్తున లేచే కొందరు హీరోలు దర్శకులు శర్వాను చూస్తే ఏమంటారో.
Full View