మళ్లీ మళ్లీ జంట మళ్లీ

Update: 2017-11-27 07:12 GMT
అందమైన రూపంతో పాటు అద్భుతంగా యాక్ట్ చేయగలగడం కేరళ కుట్టి నిత్యమీనన్ స్పెషాలిటీ. దానికి తోడు సొంతంగా డబ్బింగ్ చెప్పడంతోపాటు అవసరమైతే గొంతు సవరించుకుని ఒకటి, రెండు పాటలు కూడా పాడేయగలదు. పాత్ర నచ్చితే చిన్నదా.. పెద్దదా అన్న లెక్క చేయకుండా చేస్తుంది. ఈమధ్య అదిరింది సినిమాతో అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను మరోసారి మెప్పించిన నిత్య తాజాగా సోలో హీరోయిన్ గా  ఓ తెలుగు చేయడానికి అంగీకరించింది.

మహానుభావుడు సినిమాతో రీసెంట్ గా డీసెంట్ హిట్ కొట్టిన శర్వానంద్  హీరోగా నటించే సినిమాలో నిత్య హీరోయిన్ గా ఎంపికైంది. సుధీర్ వర్మ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా తెరకెక్కనుంది. మంచి పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఈ రోల్ కు నిత్య అయితేనే న్యాయం చేయగలదని భావించి సుధీర్ వర్మ ఆమెను కలిసి స్టోరీ వినిపించాడట. శర్వ ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. స్టోరీ నచ్చడంతో ఇందులో నటించేందుకు నిత్య మీనన్ పచ్చజెండా ఊపిందని తెలుస్తోంది.  వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

సుధీర్ వర్మ సినిమాతో శర్వానంద్ - నిత్యమీనన్ మూడోసారి జంటగా కనిపంచనున్నారు. ఇంతకుముందు రాజాధి రాజా.. మళ్లీమళ్లీ ఇది రానిరోజు సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇందులో రాజాధిరాజు తమిళ్ మూవీ కాగా.. మళ్లీమళ్లీ ఇది రాని రాజు స్ట్రయిట్ తెలుగు ఫిలిం. మళ్లీమళ్లీ ఇది రాని రాజులో వీళ్లిద్దరి నటన ప్రేక్షకులందరినీ మెప్పించింది. కమర్షియల్ గా మాత్రం పెద్దగా కాసులు రాలేదు. లేటెస్ట్ సినిమా ఈ లోటు తీరుస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News