శర్వాతో దేవ్ కట్టా.. మరో ప్రస్థానమే

Update: 2016-12-31 19:30 GMT
రెండే రెండు సినిమాలతో టాలీవుడ్ దర్శకుల జాబితాలో తనకంటూ ప్రత్యేకత సాధించుకున్నాడు దేవ్ కట్టా. వెన్నెల.. ప్రస్థానం చిత్రాలతో ప్రతిభావంతులైన దర్శకుల జాబితాలో చేరిపోయాడు. దేవ్ కట్టాతో ఒక సినిమా అయినా చేయాలని హీరోలంతా భావించారంటే.. ఎంతటి క్రేజ్ సాధించాడో అర్ధమవుతుంది. ఆ తర్వాత నాగచైతన్యతో ఆటోనగర్ సూర్య అట్టర్ ఫ్లాప్ కావడంతో.. పరిస్థితిలో మార్పొచ్చింది. ఇక కోలీవుడ్ హిట్ మూవీ అరిమనంబిని.. డైనమైట్ పేరుతో రీమేక్ చేసి మరో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాక ఇక దేవ్ కట్టాను పట్టించుకునేవాళ్లే లేకపోయారు.

కానీ తనకు టాలీవుడ్ లో హీరోగా మంచి ఇమేజ్ అందించిన దేవ్ కట్టాకు సాయం చేసేందుకు శర్వానంద్ ముందుకొచ్చాడు. అంతకుముందు కూడా నటించినా.. వెన్నెల- ప్రస్థానం చిత్రాలు శర్వా కెరీర్ ను పూర్తిగా మార్చేశాయి. అందుకే ఇప్పుడు దేవ్ కట్టాతో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడట శర్వానంద్. ప్రస్తుతం వరుస హిట్స్ తో జోరు మీదున్న సమయంలో.. ఈ స్టెప్ డేంజర్ అని అందరూ సలహా ఇస్తున్నా.. శర్వానంద్ మాత్రం దేవ కట్టాకు ఛాన్స్ ఇచ్చేందుకే మొగ్గాడని తెలుస్తోంది.

ఇప్పటికే దేవ్ కట్టా మూవీకి శర్వా డేట్స్ కూడా ఇచ్చేశాడని 2017 తొలి అర్ధభాగంలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభవుతోందని తెలుస్తోంది. ఇక్కడ శర్వానంద్ ని అభినందించాల్సి ఉంటే.. దేవ్ కట్టాకు బెస్టాఫ్ లక్ అనాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News