ఈమధ్య తమిళదర్శకుల పేరెత్తితే చాలు మన హీరోలు ఆమడ దూరం పారిపోతున్నారు. కారణం అందరికీ తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీయలేక చతికిలబడడమే. దీంతో పాటు తమిళ పైత్యాన్ని రుద్దడానికి ట్రై చేస్తుండడంతో ఆడియన్స్ వాళ్ళ సినిమాలకు కనెక్ట్ కావడంలేదు. ఏదో ఒకరిద్దరు దర్శకులు తప్ప దాదాపు తమిళ దర్శకులందరిదీ ఇదే తంతు. కానీ యంగ్ హీరో శర్వా మాత్రం ఒక తమిళ దర్శకుడికి రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
తమిళంలో ఇప్పటికే నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసిన ఆ దర్శకుడి పేరు తిరు. అందులో రెండు సినిమాల్లో విశాల్ నటించాడు. 'వాడు-వీడు'.. 'ఇంద్రుడు' గా ఆ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. రెండూ కూడా డిఫరెంట్ పాయింట్స్ తో తెరకెక్కిన సినిమాలే. మరి అలాంటి ఇంట్రెస్టింగ్ కథతో మెప్పించాడో ఏమోగానీ శర్వానంద్ మాత్రం తిరుపై నమ్మకం ఉంచాడు. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించేందుకు ముందుకు వచ్చాడట.
శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడిపడి లేచే మనసు' సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సుధీర్ వర్మతో మరో సినిమా లైన్లో ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత డైరెక్టర్ తిరు సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. మరి మిగతా తమిళ డైరెక్టర్లు షాకిచ్చినట్టు కాకుండా ఈ తిరు అయిన తెలుగు హీరోకు ఓ హిట్టిస్తాడో లేదో వేచి చూడాలి.