మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న `అంతరిక్షం` చిత్రం శర్వానంద్ నటించిన `పడి పడి లేచే మనసు` చిత్రంతో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం (డిసెంబర్ 21) నాలుగు సినిమాలు రిలీజవుతుంటే అందులో రెండు స్ట్రెయిట్ సినిమాలు - మిగతా రెండూ డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే పోటీ తీవ్రంగానే ఉంది కదా? అని మీడియా ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే శర్వానంద్ ఆసక్తికర కామెంట్ చేశారు.
``తమ్ముడు సినిమాయే కదా.. అది కూడా పెద్ద హిట్టవ్వాలి!`` అని అన్నారు. `అంతరిక్షం` లాంటి ప్రయోగం పెద్ద సక్సెసవ్వాలని - దీనిని పోటీగా భావించనని అన్నారు. అలాగే మెగా కుటుంబంలో బన్ని - చరణ్ - వరుణ్ అందరితో కలిసే పెరిగానని - అందరం చిన్నప్పటినుంచి స్నేహితులమేనని శర్వానంద్ అన్నారు. స్కూల్ డేస్ నుంచి ఒకరి కష్టం ఒకరికి తెలుసు. అందుకే మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు ఉండవని చెప్పాడు. శర్వానంద్ నటించిన `పడి పడి లేచే మనసు` చిత్రానికి అల్లు అర్జున్ ప్రమోషన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వేదికపై శర్వా ఎంత కష్టపడి ఎదిగాడో బన్ని చెప్పారు. ఒక స్థాయి వచ్చింది. ప్రేమించే అభిమానులు ఉన్నారు.. అందుకే సభాముఖంగా అతడి స్ట్రేచర్ ని గౌరవిస్తూ `గారు` అని పిలుస్తానని - స్థాయి ఉన్న వాళ్లను అసభ్యంగా పిలవనని బన్ని అన్నారు. ఇదే అందరూ నేర్చుకోవాలని సూచించారు.
ఇకపోతే ఈనెల 21న రిలీజవుతున్న చిత్రాల్లో రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. వీటి గురించి ఇంటర్వ్యూలో ప్రస్థావించిన శర్వానంద్ అసలు వాటిని ఏమాత్రం పట్టించుకోనని అన్నారు. అసలు డబ్బింగ్ సినిమాలను పోటీ అని ఎలా అంటాం? నాకు పోటీ అంటే `అంతరిక్షం` ఒక్కటేనని శర్వా వ్యాఖ్యానించారు. డబ్బింగ్ సినిమాలు కె.జి.ఎఫ్ - మారి -2 మా రెండు సినిమాలకు పోటీ కానేకావనేది శర్వానంద్ ఉద్ధేశం. ఇంట్రెస్టింగ్.. ఇంప్రెస్సివ్!!